వెన్న దొంగ డా.. కందేపి రాణీప్రసాద్.

వెన్న దొంగ డా.. కందేపి రాణీప్రసాద్.



వెన్న దొంగ
                 డా.. కందేపి రాణీప్రసాద్.

ద్వారకా వాసా ! వాసుదేవ ! నీకు ప్రణామం !
ప్రియబాంధవా ! పరంధామా ! నీకు వందనం !

ఏ పేరుతో పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా 
కోరి పిలిచిన వారికీ కొండంత అండగా నిలిచేవు
ఏ వేళ ప్రార్దించిన ఎన్ని కోరికలు కోరినా,
ఎన్ని ఫలితాలు ఆశించినా
భక్తి కలిగిన వారికి పట్టిందల్లా బంగారం చేసేవు !
కొంగు బంగారమయ్యేవు
వంశీ మోహనా ! మోహనకృష్ణా ! నీకు ప్రమాణం !
వెన్నదొంగా ! వేణుగోపాలా ! నీకు వందనం !

నెమలి పించాన్ని ధరించిన మోహనాకార రూపాన్ని
కనులార కాంచిన చేసిన పాపాలన్నీ తొలగేను !
మురళీరవాన్నాలపించే గోపిలోలుని గానాన్ని
చెవులార వినినంతనే అడిగిన వరాలన్నీ అందేను !

అరవిందలోచనా ! అనంత పద్మనాభా ! నీకు ప్రమాణం !
అర్తజనశరణ్యా ! ఆపద్బాంధవ ! నీకు వందనం !

ఆపద కాలాల్లో అదుకునేవు ! ప్రేమతో తల నిమిరేవు
ఆర్తిగా వేడిన ఆలకించేవు ! (కోరిన, కోర్కెలు తీర్చేవు)
కడుపులో పెట్టుకొని దాచేవు ! దయతో దీవించేవు
కంటికి రెప్పలా కాపాడేవు ! కరుణతో ఆశీర్వదించేవు !

ముకుందా మురారీ మాధవా మురళీకృష్ణా ! నీకు ప్రమాణం !
గోవిందా గోపాలం గోకుల కృష్ణా ! నీకు వందనం !

0/Post a Comment/Comments