నా.. తెలుగు భాష..! ..... రాసపాక వెంకటాచలం

నా.. తెలుగు భాష..! ..... రాసపాక వెంకటాచలం

నా.. తెలుగు భాష..!
******************
అచ్చతెలుగు అమ్మభాష
అద్భుతాలకు నెలువైనది..!
అమృత ధార  తెలుగు
అందమైన అక్షరాల కూర్పైనది..!

ఆకృతి దాల్చిన అక్షరమాల
ఆశయ సిద్ధికి నెలువైనది..!
ఇతిహాస తెలుగు గాధలెన్నో
ఇంపుగా భోదించినది..!

ఈ విశ్వాన్ని జయించగా
ఈశ్వరేచ్చను కల్పించినది..!
పారేటి సెలయేళ్ల చప్పుళ్ల
సంగీత స్వరధారలైనది..!

పక్షుల కిలకిల రాగాల
ప్రకృతి సవ్వడులకు నెలవైనది..!
తొలిపొద్దు కిరణాల తాకిడికి
విచ్చుకున్న తామరల
సుందర దృశ్యమైనది..!
నా.. తెలుగు భాష..!

రచన :రాసపాక వెంకటాచలం
విశిష్ఠ కవిరత్న
ఖానాపూర్, నిర్మల్ జిల్లా
చరవాణి :9440564780.


0/Post a Comment/Comments