"దాశరథి జీవితం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"దాశరథి జీవితం" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

దాశరథి జీవితం 


"తెలంగాణా గడ్డనుంచి నిజాం
నవాబును పారద్రోలడాన్కి
తన కలాన్ని గళాన్ని ఎత్తి
ధీటుగా గర్జించిన మేధావి
దాశరథి కృష్ణమాచార్యులు"

"నిజాం ప్రభువు మెడలు వంచి
నిజ జీవితం తాకట్టు పెట్టి
పేద ప్రజల గొంతుక తానై
పోరాట యోధుడిగా నిల్చిన
దాశరథి కృష్ణమాచార్యులు"

"అభ్యుదయ భావాలతో నిజాం
నిరంకుశత్వాన్ని ధిక్కరించి
తిమిరంలో సమరం చేసిన
సమర సైనికుడు, ధీశాలి
దాశరథి కృష్ణమాచార్యులు"
 
"పద్యం నడక గేయం సొగసు
తెలుసుకున్న ఆధునికుడు
కవిత్వము తెలిసిన కవి
కళ్ళల్లో కోపము నింపుకున్న
దాశరథి కృష్ణమాచార్యులు"

"భావ ప్రేరిత ప్రసంగాలతో
సాంసృతిక చైతన్యం రగిల్చి
పేద ప్రజలకు బాసటగా
నిలిచిన సమర యోధుడు
దాశరథి కృష్ణమాచార్యులు"


---ఆచార్య ఎం రామనాథం నాయుడు,
మైసూరు, +91 8762357996.

0/Post a Comment/Comments