నేతలను వెనుకకు పిలిపించే హక్కులు ఓటర్లకు ఉండాలి

నేతలను వెనుకకు పిలిపించే హక్కులు ఓటర్లకు ఉండాలి

- మార్గం కృష్ణ మూర్తి

శీర్షిక: నేతలను వెనుకకు పిలిపించే హక్కులు ఓటర్లకు ఉండాలి:
ప్రజలకు మెంబర్లను వెనుకకు పిలిపించే  అధికారాన్ని( POWER TO CALL BACK MEMBERS) , హక్కులను కల్పించాలి. 
సభ్యుడు సమర్ధుడని , వ్యక్తిత్వం మంచిదని, అవినీతి పరుడు కాదని , గూండా కాదని , విద్యా వంతుడని అన్ని రకాలుగా పరిశీలించి , పరిశోధించి , తెలివిగా ప్రజలు ఓట్లు వేస్తారు. కానీ రోజులు , నెలలు , యేండ్లు గడిచినా ,M.L.A.లు M.P. లు ( కొందరు )తమ ఇష్ట ప్రకారమో లేక తమ పార్టీ అధ్యక్షుడి మాట ప్రకారమో హైదరాబాద్ లోనో లేదా ఢిల్లీ ఏసీ గదుల్లో నో లేదా మరో పట్టణం లోనో దేశం లోనో హాయిగా తినుకుంటూ కూర్చొని , నిధులు సంపా దించు కుంటూ భూములు ( ముఖ్యంగా వ్యవసాయ భూములు ) , బంగారం కొనుక్కుంటూ ,  స్విస్ బ్యాంకులో దాచు కుంటూ , విదేశాలు చుట్టి వస్తూ, వారిని గెలిపించిన నియోజ వర్గం ప్రజల మొఖం చూడక పోతే , వారి బాధలను పట్టించు కోక పోతే , వారి ప్రాంతాన్ని అభి వృద్ది చేయక పోతే , ఇక ఆ  '5'  సం. రాలు ప్రజలు బాధలు పడాల్సిందేనా ?, గమ్మున చూస్తూ కూర్చోవలిసిందేనా? . అలాంటి వారిపై చర్య లేమిటి ? నేడు  ఒక్కో మెంబరు సాలుకు 5 కోట్లు  నియోజక వర్గ అభివృద్ధి కొరకు నిధులు  తీసుకుంటూ 25% కూడా సద్వినియోగం చేయని వారున్నారని విన్నాం . సభలల్లో మాట్లాడని వారున్నారని తెలుసు కున్నాం . ప్రశ్నలడగ డానికి డబ్బులు తీసుకున్న వారున్నారని చూశాం . సభల్లో కొట్టు కునే వారిని టి .వి . చానాళ్ళ ద్వారా చూస్తున్నాం . 

అందుకని, 

01.  గెలిచిన సభ్యులు , ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో వారి హామీలను 51% అయినా మొదలు పెట్టక పోయినా , మిగిలిన 49% హామీలు ఆ తరువాయి  కాలం లో పూర్తి చేయక పోయినా , అలానే ప్రజల ఓట్ల చేత గెలిచిన ప్రతి పక్ష పార్టీల సభ్యులు ప్రశ్నించక పోయినా , నైతిక బాధ్యత వహించి సభ్యత్యానికి రాజీనామా చేయాలి.

02.  లేదా అలాంటి సభ్యులను వెనుకకు రప్పించే అవకాశం , అధికారం ఎన్నుకున్న ప్రజలకు వుండాలి. అలాంటప్పుడే , నాయకులు సాధ్య మయ్యే పనులకే హామీలు ఇస్తారు . అబద్ధాలు చెప్పరు. అద్దం లో చంద మామను చూపించరు. ప్రజలను మోసం చేయరు , మోస కారులు ఎన్నికలకు పోటీ పడరు . చేత కాని వారు, పండు ముసలులు, మసి బోసి మారేడు కాయను చేసే వారు, వాక్చాతూర్యం లేని వారు ఎన్నికలకు దూరంగా వుంటారు. సీట్ల కోసం లక్షలు, కోట్లు కుమ్మరించరు. ఈ రకంగా నైనా, అవినీతి కొంత వరకు తగ్గుతుంది. 

03.  అలానే  ప్రజల, ప్రభుత్వ సొమ్ములను దుర్వినియోగం చేసినా, కోట్లను కూడబెట్టినా, ప్రజలను  పట్టించుకోక పోయినా , దేశ భద్రతకు , శాంతికి భంగం కలిగించినా, అవినీతికి పాల్పడినా, ఆశ్రిత పక్ష పాతం  చూపినా, మెంబర్లను  వెనుకకు పిలిపించి అధికారం ప్రజలకే ఉండాలి కాని, పార్టీ నాయకుడికి కాదు . 
ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు , ఇలాంటి వాటికి రాజ్యాంగ సవరణలు చేయ లేవు . అందు కని , ప్రజల అభ్యర్ధనను మన్నించి ఎన్నికల కమీషన్ , లా కమీషన్ , జుడిస్యరీ వ్యవస్థ లేదా ప్రసి డెంటు గారు వారి వారి విశేసాధికారాలను ఉపయోగించి, "ప్రజలకు మెంబర్ల ను వెనుకకు పిలిపించి పదవి రద్దు చేసే అధికారాన్ని , హక్కులను కల్పించాలి."

అప్పుడే మంచి అభ్యర్ధులను ఎన్నుకున్నామన్న సంతోషం ఓటర్లకు ఉంటుంది. ఓ రోజంతా శ్రమించి వేసిన ఓటుకు విలువ ఉంటుంది. రాష్ట్రాలు, దేశం అభి వృద్ధి చెందుతుంది , ప్రజలు సుఖంగా జీవిస్తారు .

- మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments