సన్మార్గం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి

సన్మార్గం(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి

సన్మార్గం(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.


ఉద్యమంలో అహింస అవసరమని
నిరసనలో సత్యాగ్రహం ఆచరణీయమని
నడిచేమార్గం శాంతి మయం కావాలని
ఉద్రిక్తపరిస్థితుల్లో సహనం చూపాలని
అందరితో సౌభ్రాతృత్వం కల్గి ఉండాలని
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని
గ్రామస్వరాజ్యమే అభివృద్ధికి బాట పరుస్తుందని
స్వచ్ఛత,పరిశుభ్రతలు అత్యంత ఆవశ్యకాలని
స్వయంసేవయే మానవుల కర్తవ్యమని
నిత్యం నీవు చేసే ప్రార్థనయే
శక్తినిస్తుందని
అన్నిపనుల్లో క్రమశిక్షణే ఉత్తమమని
చేసే పనుల్లో నిబద్ధత ఉండాలని
ప్రజల మధ్య ఐక్యతే శ్రీరామరక్షయని
జీవనం నిరాడంబరంగా సాగాలని
దేశభక్తి, దైవభక్తి నీ ఆయుధాలని
సంప్రదింపులు,చర్చలు,సమస్యల‌ 
పరిష్కారానికి మార్గాలని,
న్యాయ,ధర్మమార్గాలే సంప్రదాయాలని
శాకాహారం,సజ్జనసాంగత్యం నిత్యకృత్యాలవ్వాలని
మార్గనిర్దేశనం చేసిన గాంధీమార్గం
సదా అనుసరణీయం,వందనీయం.


0/Post a Comment/Comments