"తెలుగు కవితా సౌరభం - బాపిరాజు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"తెలుగు కవితా సౌరభం - బాపిరాజు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

తెలుగు కవితా సౌరభం - బాపిరాజు

అడవి ఇంటి పేరు కలిగి
బాపిరాజు అనే నామధేయుడై
తెలుగు సాహిత్యాన్ని తనదైన
నందన వనం చేసుకుని
ఆనంద సాగరంలో పరవశించి
తెలుగు సాహితీ పాఠకులకు
మందార మకరందాలు అందించి
ప్రసిద్ధ కవిగా కథకుడుగా
చలన చిత్ర కళా దర్శకుడుగా
ప్రముఖ చిత్రకారుడిగా
గాంధేయవాదిగా నటుడిగా
నాట్యాచార్యుడిగా విద్యావేత్తగా
ఉత్తమ కథానాయకుడిగా
సాటిలేని మేటి పత్రికా సంపాదకుడిగా
బహుముఖ ప్రజ్ఞావంతుడై
అత్యంత ప్రతిభను ప్రదర్శించి
ఆధునికాంధ్ర వాఙ్మయంలో
విశిష్ట స్థానాన్ని పొందిన
తెలుగు సాహితీ కారుడు
మన అడివి బాపిరాజు



ఆచార్య ఎం.రామనాథం నాయుడు, మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments