రక్షా బంధనం..!(కవిత),ముహమ్మద్ ముస్త ఖీమ్ విన్నర్

రక్షా బంధనం..!(కవిత),ముహమ్మద్ ముస్త ఖీమ్ విన్నర్

రక్షా బంధనం..!(కవిత)

అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎప్పటికీ వీడనిది..!
అన్నా అన్న పిలుపులో 
చెల్లి అనురాగం అనంతమై ఉన్నది..!
చెల్లీ అన్న పిలుపులో కమ్మనైన అమ్మ లాంటి ఆప్యాయత ఉన్నది..!
జన్మ జన్మల 
అనుబంధమే,
అనురాగ ఆప్యాయతల సమాహారమే,
ఎనలేని రక్షక కవచం..అన్నయ్య..!
ఎన్నడూ వీడని 
సురక్షల నీడ..అన్నయ్య..!
అన్నయ్య ఓ భరోసా..!
అమ్మ,నాన్న తర్వాత 
మరో నాన్ననే..అన్న..!
ఆ దేవుడు సృష్టించిన విలువైన అనుబంధం
అన్నా చెల్లెళ్లది..!
దేహాలు దూరమైనా..ఆత్మలు దగ్గరే..!
ప్రేమానురాగాలు,
ప్రేమాప్యాయతలు, 
ప్రేమానుబంధాలు,
పదిలంగా ఉండడం కోసం,
రక్షించే బంధనంగా..రక్షా బంధనం..!


✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments