ఎవరు విశ్వవిజేత ?... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్, హైదరాబాద్.

ఎవరు విశ్వవిజేత ?... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్, హైదరాబాద్.

ఎవరు విశ్వవిజేత ?

కల గన్నవాడు 
కసి ఉన్నవాడు
కత్తిలా పదునైనవాడు 

పక్కాప్లాన్ ప్రకారం
ముందుకు దూకేవాడు
ముందు చూపుగలవాడు 
పగలురాత్రి శ్రమించేవాడు

పట్టుదల ఉన్నవాడు
పడినా లేచి పరిగెత్తేవాడు 
ప్రయ్తత్నాన్ని విరమించనివాడు
పదేపదే గట్టిగా ప్రయత్నించేవాడు

తింటున్నా తిరుగుతున్నా
పడుకున్నా నిద్రలో సైతం పని
పని అని కలవరించే పనిరాక్షసుడు

తల్లిదండ్రుల మాటలు విన్నవాడు
తన శక్తినే తాను నమ్ముకున్నవాడు
తన తప్పులుతాను తెలుసుకున్నవాడు

భయమన్నది ఎరుగనివాడు
భక్తిలో నిండా మునిగినవాడు
భగవంతునిపై భారం వేసినవాడు
ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాడు
వాడు విజేత...కాదు కాదు వాడే విశ్వవిజేత.....

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502
 

0/Post a Comment/Comments