ఉపాధ్యాయులు కొంపెల్లి రామయ్య కు "గిడుగు రామ్మూర్తి పంతులు స్మారక పురస్కారం"
గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తేదీ: 29/08/2021 న తెలుగు భాషా దినోత్సవం రోజున రాత్రి గిడుగు రామ్మూర్తి పంతులు స్మారక పురస్కార కార్యక్రమం వ్యవస్థాపకురాలు గిడుగు కాంతి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కళారత్న బిక్క కృష్ణ గార్ల అధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు ఉపాధ్యాయులు కొంపెల్లి రామయ్య రాసిన "గుండె చప్పుడు" కవితా సంపుటికి గాను సాహిత్య రంగంలో గిడుగు రామ్మూర్తి పంతులు స్మారక పురస్కారం కళా రత్న బిక్క కృష్ణ, గిడుగు కాంతి కృష్ణ,తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి బి.చంద్రకుమార్, ఎం.ఎల్.సి. కవి గాయకుడు గోరేటి వెంకన్న, ఆంధ్ర ప్రభ సంపాదకులు వై.ఎస్.శర్మ, శత చిత్ర నిర్మాత టి. రామ సత్యనారాయణ, ప్రముఖ సంఘ సేవకురాలు అనూహ్య రెడ్డి, ప్రముఖ రచయిత్రి భాషా పరిశోధకురాలు రాజా వాసి రెడ్డి మలీశ్వరి తదితరుల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది .ఈ సందర్భంగా వికాస వేదిక అధ్యక్షులు సాధనాల వెంకట స్వామి నాయుడు ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్, బుక్కా సత్యనారాయణ, మలిశెట్టి కృష్ణ మూర్తి, గాజుల భారతి శ్రీనివాస్, యడవల్లి శైలజ, తాళ్ల యోగానందం, భూక్యా హచ్యా, జహీరోద్ధిన్, మద్ధం రమణ మూర్తి, అంగోతు జయ వాసు, చినహుస్సెన్, గోవింద్, రేళ్ళ శ్రీనివాస్, శోభనాద్రి, సీత్లనాయక్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు