మైత్రీబంధం
రామచిలక పలుకు కన్నా మధురమైనది
ఏమిటంటే మనసు చదివే మిత్రుడొకరు
మరపురాని నేస్తమెపుడు
బతుకులోని వ్యధలు అన్నీ మంచిమాటతో మాయమయ్యి
కలతలన్నీ కరిగిపోవు చెలిమి ఒడియై సేదదీర్చు
మల్లెగంధము,చందనమ్ములు కలిపి చిలికిన అమృతమ్ము పూలరెమ్మల మించు సొబగులు హృదయబంధం విరిసికురియు పరిమళంబులు
హృదయవాటిక తెరుచుకునెడి ప్రణయరాగం మించునట్టి
పరవశంబులు పంచునిలలో
వెన్నెలంటీ చల్లదనం శిశిర కాంతుల హాయిగుణము
మల్లెలాంటి తెల్లనైన మలినమంటని మైత్రీబంధం
మసకబారిన మనసుకెపుడు మార్గమిచ్చును మలయపవనం
దిగులు చెందగ అంతరంగం చెంతచేరు తలచినంతనే
జుంటితేనెల తీయదనం విశ్వమంతా గెలుచు ధైర్యం
కష్టసుఖముల కడలి అలలు ఎగిసిపడగా దరికి చేర్చు ఒయాసిస్సు
నిశిని చిమ్ము దారిపొడుగునా మెరుపు కాంతుల ఆశాకిరణం
మధురమైన జ్ఞాపకాల్ని చిరునవ్వుల సంతకమై వీచే వాసంత సమీరం
✍️ తాళ్లపల్లి భాగ్యలక్ష్మి (టీచర్)
రాజన్న సిరిసిల్ల జిల్లా
9490183850