అమ్మ భాష పలుక తెగువ చూపాలిక...! --కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అమ్మ భాష పలుక తెగువ చూపాలిక...! --కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం



అమ్మ భాష పలుక తెగువ చూపాలిక...!
--కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

అమ్మ భాష తెలుగు చెలిమ ఊరినట్లు
కమ్మనైన తెలుగు తేజరిల్లు
దేశభాషలందు వెలుగు మిరుమిట్లు
వేషము కన్న నీ భాష మిన్న!

అమ్మ కంటే గొప్ప అవని యందు లేదు
అమ్మ భాష మించి ఆకాశము లేదు
పర భాష గొప్పయని పలుకుట మిటుకుట
మన భాష నేర్వని జన్మమేలా?

మాతృ భాష విస్మయం భాషా దారిద్య్రంబు
మాతృ భాష పట్టు ఇతర భాషలు నేర్పు
మాతృ భాష విద్య మనసు చురుకుగనుండు
కమ్మనైన  అమ్మ భాష కడుపు నిండు!

పరదేశీయులు వారి భాషలు నేర్వ
ఇరుగు పొరుగు రాష్ట్రాలు వారి భాషలు పలుక
మన  భాష మాట్లాడ మనకెందుకు సిగ్గు
తెలుగు వారందరూ అమ్మ భాష పలుక తెగువ చూపాలికా...!




0/Post a Comment/Comments