గుర్రాల ముత్యాల హారాలు.
----------------------------------
1). ఓం శివ హరి గణనాధ
ఓం మురహరి గణనాధ
వినవా స్వామి మా గాధ
కనవా ఏమి మా బాధ. !
2). రామకోటి వ్రాస్తున్న
నే పూజలు చేస్తున్న
గుంజీలను తీస్తున్న
దీవెనల ఆశిస్తున్న !
3). పట్టు పట్టు పట్టు పట్టు
మాంచి లేత నేత పట్టు
మిషను పై వేసి కుట్టు
ఇంటి లోన నీవు పెట్టు !
4). పుట్ట పైన కాలు పెట్టు
పుట్టతేనెను కనిపెట్టు
జోపి నీవు బాగ పట్టు
తెచ్చి ఉట్టి మీద పెట్టు !
5). నీవు గట్టి పట్టు పట్టు
కలమును చేత బట్టు
నీ కవిత రాసి పెట్టు
విప్పవా దాని గుట్టు !
6). పెట్టు పెట్టు పెట్టు పెట్టు
నుదుటన బొట్టు పెట్టు
కంటికి కాటుక పెట్టు
తలలో పువ్వులు పెట్టు !
7). ఆలయంలో కాలెట్టు
ఆ గుడి దీపం పెట్టు
పబ్బతి వెంటనే పట్టు
పప్పు బెల్లం పంచిపెట్టు !
8). ఆలయ మందు భజనలు
చేస్తున్నారులే జనులు
ఇల వారేగా ఘనులు
దగదగ మెరిసే మణులు !
9). దిక్కులేనివారికి
దిక్కు దేవుడే చివరికి
మొక్కు ఇక ఆ స్వామికి
పుణ్యం పొందు చివరికి !
10). ఆట పాటలు ఆడు
అందరితో కలిసి నేడు
మెచ్చరు అంతా చూడు
వస్తారు నీకు ఇక తోడు !
11). అతిగా ఫోను వాడకు
వాడి నీవు ఇక చెడకు
చెడు దృశ్యాల చూడకు
చెడులోన పడి పోవకు !
12). కరోనా కరుణ లేనిది
నీ పక్కనే వాలి నది
అది వేచి చూస్తున్నది
మెల్లగాను వస్తున్నది !
13). మన పల్లె అందాలు
ఘనమైన చందాలు
ఇక చేసుకో విందులు
అవి మన కనువిందులు !
14). డబ్బుకు ఇవ్వు విలువ
కొసరుతు కొను వలువ
వదరకురా ఓ పలువ
అంటారు నిన్ను తులువ!
15). నవ్వుతూ మాట్లాడు
న్యాయం కై పోట్లాడు
నీతి పరుల వెంట ఉండు
అప్పుడు పంట పండు. !
--- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.