జోహార్ *జయ శంకర్*
=================
నిండు బాధలఉరిమె మేఘం
వర్షించే చిరునవ్వుల మోహం
మంచు గడ్డల కరిగే హృదయం
రగలే నిప్పు , వీచె వాయువు
జనగర్జనవై కదలే కడలి....
జై తెలంగాణ నినాదపిడుగై
మండే మంటతో ఎత్తన పిడికిలి
బడిలో గుడిలో జన సందడిలో
తెలంగాణమే ఉపిరి పాటగా
రాష్ట్ర సాధనే ఉద్యమ బాటగా
అక్రందనలు ఆవేదనలు
ఆఖరి మజిలి కాదంటూ...
పిడికిలి పీడియే నీ చేయి
కన్నీటి తడిని తుడ్చేయ్....
అంటూ విషవృక్షాల పెకలింప
విషయమేమిటో వివరించి
విశాదంలో వినయంగా
విజయ శంఖమే ఆశించి
విద్యాలయల క్షేత్రంలో
పొరాట మొక్కలు నాటించి
వీర కుసుమాలు పూయించి
అమరవీరుల నేత్తుటి మరకల తిలకంగా
తెలంగాణ రణరంగాన ఆత్మఘోషణై
మన అత్మీయ ఉద్యమ పితమౌహుడుగా
ప్రతివాడికి పోరాట గుత్పను అందించి
సమరశిలగ మిగిలిపోయిన ఆ బ్రహ్మచారి
ఆధిపత్యాల అణచివేతలో
అసువులు బాసిన అమర వీరుల ఊపిరివై
ఉద్యమపాఠాల మాష్టారుగా
ఆత్మాగౌరవపు పచ్చని చీరను
తెలంగాణకు కట్టాలంటూ....
కలలు గన్న సిరచుక్కతో వేగు చుక్కల
వెలుగు చూపినాడు జయ శంకర్
అమర్ హై అమర్ రహేగా !
హమారే మంజిల్ ఇ మక్సద్
జైయహై జయ జయ జయశంకర్....
*మురళీ జాదవ్*
ఉపాద్యాయులు
ఉట్నూర్ , ఆదిలాబాద్ జిల్లా
తెలంగాణ
9492539553.