భువిపై నవస్వర్గం ---వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య ) ఇంగ్లిష్ లెక్చరర్ కాకతీయ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి ఖమ్మం జిల్లా

భువిపై నవస్వర్గం ---వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య ) ఇంగ్లిష్ లెక్చరర్ కాకతీయ డిగ్రీ కాలేజ్ సత్తుపల్లి ఖమ్మం జిల్లా

భువిపై నవస్వర్గం

ప్రాణవాయువుకు చెట్టు కొమ్మలే
పట్టుగొమ్మలని గ్రహించు
అడుగడుగునా మొక్కల్ని పెంచుదాం
అవని అంతా హరితమయం చేద్దాం
నాటిన ప్రతి మొక్కను వృక్షంగా చూద్దాం
నీరు పోసి ఎదిగేవరకు రక్షణనిద్దాం
మొక్కమొక్కకు నీ రెక్కల కష్టం
కావాలి ఎరువు
ఎదిగే మొక్క తరువై తీర్చాలి
నీ బతుకు బరువు
హరితహారం కావాలి అవనికి ఆసరా
జనజీవన స్రవంతికి భరోసా
మొక్కమొక్కలో ప్రాణం ఉందని తెలుసుకో
నీ ప్రాణానికి ప్రాణవాయువు ఇచ్చేదే
 నువ్వు పెంచిన తరువు
పంటపొలాలతో పురుడోసుకోవాలి అవని
హరితంతో ముదమందాలి జన జీవనం
నీ ఆశ శ్వాస హరితం కావాలి
ఆనందమయ జీవితానికి నాంది కావాలి
భవితకు చేతనైన చేయూతనందించు
ప్రాణికోటికి ప్రాణవాయువును పంచు
భువిపై " నవస్వర్గాన్ని " నిర్మించు
చేయీ చేయీ కలుపుదాం
రేపటి తరాలని నిలుపుదాం
పచ్చని మొక్కలతో అవని పులకించాలి
అణువణువు ఆనందసంద్రమై పలకరించాలి
ధరణి దశదిశలా హరితమయమై మెరవాలి
 

 వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య )
 ఇంగ్లిష్ లెక్చరర్
 కాకతీయ డిగ్రీ కాలేజ్
 సత్తుపల్లి
 ఖమ్మం జిల్లా
 తెలంగాణ రాష్ట్రం.
మొబైల్..9 7 0 1 0 9 9 3 1 0 

0/Post a Comment/Comments