నా తెలుగు భాష
---------------------------
యాభై ఆరు అక్షరాలతో తేనె లోలుకు
భాష మన తెలుగు భాష...
అందమైన తెలుగు భాష,
మన తెలుగు వారి మాతృభాష.!
అచ్చులు,హల్లులు,సందులు
చందస్సులు కలుపుకొని,
ఉపమాన,ఉపమేయ అలంకారాలతో,
అర్థం,నానార్థం,పర్యాయపదం,
వ్యాకరణాలమణిహారం,
ప్రకృతి వికృతిలతో పాటు
ప్రాంతీయ,మాండలీక వ్యవహారం,
వేదం, ఇతిహాసం, కావ్యం, పురాణం, గ్రంధం కలగలిపిన సుమనాల హారం,
చరిత్ర,నాగరికతలతో పాటు
ఆస్థావధానం,పద్యం,గద్యం
జానపదాలకు సొంతం..
హరికథ, బుర్రకథల సమాహారం,
మన్నికైన రచనలకు ఆజ్యం,
కవి కలం నుండి జాలువారిన
కవితల మణి హారం..
కల్గిస్తుంది విజ్ఞానం.!
దేశ భాషలన్నింటికి తలమాణికం..!!
ఎన్..రాజేష్
(ఎమ్మెస్సి-పీజీడీసీజె)
కవి, జర్నలిస్ట్
హైదరాబాద్.
ప్రక్రియ :- వచన కవిత.