ఈ రోజు..
--------------------------
ఎందరో వీరమాతల
గర్భవృక్షపు ఫలాలు
స్వాతంత్ర్య సమరంలో
నేల రాలిన రోజు ఈరోజు
ఎందరో విప్లవవీరులు
స్వేచ్చావాయువుల కోసం
అసువులు బాసిన రోజు ఈరోజు...
ఆంగ్లేయుల గుండెల్లో
విప్లవ శంఖం ఊదిన రోజు
సింహ స్వప్నంగా నిలిచిన రోజు
సింహగర్జన చేసిన రోజు ఈరోజు
భరతమాత బానిస సంకెళ్లు
విముక్తికై
ఎందరో అమర వీరులు,
సమరయోధులు
ఆత్మబలిదానాలు చేసిన తొజు
తమ సర్వస్వం ధారవోసిన రోజు
తెల్లోళ్ల తూటాలకు
దేశభక్తుల ప్రాణాలు బలియై,వెలియై
అనంత వాయువుల్లో కలసిన రోజు
ఎందరో మహానుభావుల
త్యాగఫలము
నేడు మనము అనుభవిస్తున్న
"స్వాతంత్ర్యము"
సమరయోధులను స్మరిస్తాం!
ఒక్కింత దేశభక్తి చూపిద్దాం!!
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
9966414580.