చూశారా అందమైన ఓ మందారం
విరిసింది అందంగా
ఆ అందానికి ఆకర్షణ చెంది వాలింది
ఓ రంగుల పిట్ట
దాని రంగు ఆ పిట్ట రంగు ఒకటేనని కాబోలు
విరిసింది అందంగా
ఆ అందానికి ఆకర్షణ చెంది వాలింది
ఓ రంగుల పిట్ట
దాని రంగు ఆ పిట్ట రంగు ఒకటేనని కాబోలు
ఆ మందారానికి ఎక్కడ లేని ఆనందం కలిగింది
ఆ పిట్ట అంది" మందరమా ఏమి రంగు నీది
ఎంత అందంగా ఉన్నావో కదా" అని
నారంగు నా అందం కేవలం ఓక్క రోజే కదా
అటుపై వాడి పోతా కదా!
నీవేమేలు అలా ఎన్నాళ్ళో ఉంటావు
ఎంచక్కా ఎగిరేగిరి తిరుగుతావు
ఆకాశంలో అందాలన్నీ చూస్తావు
అన్ని చెట్లపై వాలుతావు
నేనైతే పుట్టడం ఇక్కడే గిట్టడం ఇక్కడే
అని తనగోడు చెప్పుకుంది
మందారం
అప్పుడు ఆ పిట్ట
నా చిన్ని బొజ్జకు ఆహారం ఎవరు పెడతారు
లేచింది మొదలు
ఎక్కడ నాలుగు గింజలు దొరుకునోనని
ఎగిరి ఎగిరి అలసట వస్తుంది
నీకేమి ఎంచక్కా మీ అమ్మ
ఓ కొమ్మనిచ్చింది నీకు ఆధారంగా
నీ చెంతనే ఉంది
నీకు తిండి పెడుతుంది
అని తన గోడు చెప్పుకుంది
ఎవరి బాధ వారిది
మనకే కాదు ఎదుటివారికి కష్టాలుంటాయన్నది
వీటి సంభాషణ సారాంశం
మనకూ అంతే దూరపుకొండలు నునుపే
దగ్గరకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాటి ఎత్తు పల్లాలు
ఉన్న దానితో తృప్తి పడదాం
లేని దానికి ఆశపడక
డా విడి రాజగోపాల్
9505690690
(ఫోటో మల్లెల నరసింహా మూర్తి గారిది కవిత నాది)
ఆ పిట్ట అంది" మందరమా ఏమి రంగు నీది
ఎంత అందంగా ఉన్నావో కదా" అని
నారంగు నా అందం కేవలం ఓక్క రోజే కదా
అటుపై వాడి పోతా కదా!
నీవేమేలు అలా ఎన్నాళ్ళో ఉంటావు
ఎంచక్కా ఎగిరేగిరి తిరుగుతావు
ఆకాశంలో అందాలన్నీ చూస్తావు
అన్ని చెట్లపై వాలుతావు
నేనైతే పుట్టడం ఇక్కడే గిట్టడం ఇక్కడే
అని తనగోడు చెప్పుకుంది
మందారం
అప్పుడు ఆ పిట్ట
నా చిన్ని బొజ్జకు ఆహారం ఎవరు పెడతారు
లేచింది మొదలు
ఎక్కడ నాలుగు గింజలు దొరుకునోనని
ఎగిరి ఎగిరి అలసట వస్తుంది
నీకేమి ఎంచక్కా మీ అమ్మ
ఓ కొమ్మనిచ్చింది నీకు ఆధారంగా
నీ చెంతనే ఉంది
నీకు తిండి పెడుతుంది
అని తన గోడు చెప్పుకుంది
ఎవరి బాధ వారిది
మనకే కాదు ఎదుటివారికి కష్టాలుంటాయన్నది
వీటి సంభాషణ సారాంశం
మనకూ అంతే దూరపుకొండలు నునుపే
దగ్గరకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాటి ఎత్తు పల్లాలు
ఉన్న దానితో తృప్తి పడదాం
లేని దానికి ఆశపడక
డా విడి రాజగోపాల్
9505690690
(ఫోటో మల్లెల నరసింహా మూర్తి గారిది కవిత నాది)