(26ఆగష్టు 1910-5సెప్టెంబర్ 1997)
కరుణ, ప్రేమ, దయా, మమకారం, మమతానురాగం, సేవామూర్తి, స్వచ్చంధ సేవాసంస్థల సృష్టికర్త, మానవత్వదాతృత్వ కార్యక్రమాల నిలువెత్తు ప్రతీక, శరణార్ధుల ఆశా జ్యోతి, మిషనరీస్ ఆఫ్ చారిటీ ఫౌండర్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, శాంతి దూత, భారతరత్న మదర్ థెరెసా జన్మదినం ఆగష్టు 26వ తేదీన జరుపుకుంటున్నాo.
మదర్ థెరెసా అసలు పేరు "అగ్నీస్ గోక్షా బోజా క్షుయ". మాసిడోనియా లోని స్కోప్జే లో నికొల్లే, డ్రానాబోజాక్షుయ దంపతుల ఆఖరి సంతానం. 1919లో ఆగ్నెస్ కు 8సం!! ల వయసు వున్నప్పుడు స్కోప్జే ను అల్బేనియా నుండి తొలగించే నిర్ణయం తీసుకున్న ఒక రాజకీయ సమావేశం తరువాత ఆమె తండ్రి జబ్బుపడి మరణించారు. ఆ సమయం లో ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉన్న ఆమె 1910ఆగష్టు 26న జన్మించినప్పటికీ తాను మతం స్వీకరించిన 1910 ఆగష్టు 27వ తేదీన తన నిజమైన పుట్టినరోజు గా భావించారు. ఆమె తండ్రిమరణo తర్వాత తల్లి ఆమెను రోమన్ కాథలిక్ గా పెంచారు.
ఆమె బాల్యంలోనే మత ప్రచారకుల జీవిత కథల పట్ల వారి సేవల పట్ల ఆకర్షింపబడ్డాయి. 12సం!!వయస్సు వచ్చే సరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18సం!!ల వయస్సులో ఇళ్లు వదిలి "సిస్టర్ ఆఫ్ లోరెటో "అనే ప్రచారకుల సంఘం లో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కానీ సోదరిని కానీ కలువలేదు.
1929లో ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారతదేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు. 1931 మే 24 న ఆమె సన్యాసినిగా తన మొదటి ప్రతిజ్ఞ చేశారు. మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐనా "తెరేసే డి లిసే " పేరు మీదుగా తన పేరును థెరెసా గా మార్చుకున్నారు. 1937మే 14లో తూర్పు కలకత్తా లోని లోరెటో కాన్వెంట్ పాఠశాల లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు తన పవిత్ర ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నప్పుడు కలకత్తా చుట్టు పక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది. 1943లో ఏర్పడిన హిందూ ముస్లిం హింస నగరాన్ని నిరాశ, భయాందోళనలకు గురి చేసింది.
1946సెప్టెంబర్ 10లో థెరెసా తన సాంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తా నుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నప్పుడు తాను "పిలుపులో పిలుపు"గా పొందిన అనుభవాన్ని గురించి తెలియజేశారు. "నేను కాన్వెంట్ ను వదిలి పేదల మధ్య నివసిస్తూ వారికి సేవ చేయాలి. ఇది ఒక అజ్ ఆజ్ఞ దీనిని పాటించక పోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే 1948లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటు ను వదిలి నిరాడంబరమైన, నీలపు అంచు గల తెల్లటి నూలు చీరను ధరించి భారత పౌరసత్వం స్వీకరించి మురికివాడలలో ప్రవేశించారు. ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు. అన్నార్తుల అవసరాలను తీర్చసాగేరు.
థెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు. ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం, ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది. ఈ ప్రారంభ నెలలో ఒంటరి తనం, ఆశ్రమ జీవితంలోని సౌకర్యాలను మరలి పోవాలనే ప్రేరేపణ వంటి సంశయాలను కలిగి ఉన్నారు. 1950లో అక్టోబర్ 7ఆమె వాటికన్ అనుమతి తో మత గురువుల సంఘాన్ని ప్రారంభించారు. అదే తర్వాత "మిషనరీస్ ఆఫ్ ఛారిటీ"గా రూపొందిందింది.
ఆమె మాటలలో "ఆకలి గొన్న వారల దిగంబరుల నిరాశ్రయుల, కుంటి వారల, కుష్టు వ్యాధి గ్రస్తుల, అందరు త్యజించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింప బడిన వారు, సమాజానికి భారమైన వారల, అందరిచే విషర్జించబడిన వారలను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం." ఇది కలకత్తా లో 13మందితో ప్రారంభమై 4,000 కు పైగా సన్యాసినులను కలిగి అనాథ శరణాలయాలు నిర్వహిస్తూ, ఎయిడ్స్, అంధులకు, అంగవికలులకు, వృద్ధులకు సహాయం చేస్తారు.
1952లో మదర్ థెరెసా కలకత్తా నగరం చే ఇవ్వబడిన స్థలం లో మొదటి "హోమ్ ఫర్ ది డయింగ్" ప్రారంభించారు. భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాల గా మార్చారు. ఆమె దానికి "కాళీ ఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం "నిర్మల్ హృదయ్ "గా పేరు పెట్టారు. కుష్టువ్యాధి గా పిలవబడే హన్సన్ వ్యాధిగ్రస్తులకు "శాంతి నగర్" అనే పేరుతో ధర్మశాల ను ఏర్పాటుచేశారు.
1955లో ఆమె అనాధలకూ, నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన నిర్మల శిశుభవన్ ను ప్రారంభించారు. 1960నాటికి భారత దేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను అనాథ శరణాలయాలను ఏర్పాటుచేసింది. 1965లో 5 సిస్టర్స్ తో మొదటి ఆశ్రమం ఏర్పాటుచేసింది. 1968లో రోమ్, టాంజానియా, 1970 లో ఆసియా, ఆఫ్రికా వివిధ దేశాల్లో ఫౌండేషన్ లు స్థాపించెను. 2007 నాటికి మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను, 5000 మంది సన్యాసినులను కలిగి 600 శాఖలను నిర్వహిస్తూ 120దేశాలలో పాఠశాలలు, ఆశ్రమాలను కల్గివుంది.
1982లో బీరూట్ ఆక్రమణకు గురైన సందర్బంలో మదర్ థెరెసా ఇజ్రాయిల్ సైన్యానికి పాలస్తీనా గెరిల్లా లకు మధ్య కాల్పుల విరమణ కు మధ్య వ్యర్థిత్వం వహించి ఒక వైద్యశాలలో చిక్కుకు పోయిన 37 మంది పిల్లలను రెడ్ క్రాస్ వారి సహాయం తో కాపాడారు. 1991 లో తన మాతృ దేశమైన అల్బేనియా లోని టిరానా లో మిషనరీస్ ఆఫ్ చారిటీ బ్రదర్స్ హోమ్ ను ప్రారంభించారు.
ఆమె సేవలకు గాను గుర్తింపుగా పొందిన అవార్డులు, బిరుదులు.
1979 లో నోబెల్ శాంతి బహుమతి
1980 భారతరత్న పురస్కారం
టెంపుల్ టన్ అవార్డు
ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు
1962 లో పద్మశ్రీ అవార్డు
1969 లో జవహర్ లాల్ నెహ్రు అంతర్జాతీయ అవగాహన.
సెప్టెంబర్ 5వ తేదీ 1997 లో మదర్ థెరెసా గారు హృద్రోగ వ్యాధి తో పరమావధించారు.
మదర్ థెరెసా గారి పేరు మీద "మదర్ థెరెసా మహిళా విశ్వవిద్యాలయం" కొడైకెనాల్ తమిళనాడు లో 1984లో స్థాపించారు. భారతీయ రైల్వే శాఖ "మదర్ ఎక్స్ ప్రెస్" అనే పేరుతో 2010ఆగష్టు 26న శతజయంతి సందర్బంలో ప్రారంభించింది. 2013సెప్టెంబర్ 5వ నాటి నుండి మదర్ థెరెసా వర్ధంతిని ఐక్య రాజ్యసమితి "అంతర్జాతీయ దాతృత్వ దినంగా" పాటించబడుచున్నది.
మరణించిన 18ఏళ్ల తర్వాత 2016 సెప్టెంబర్ 4వ తేదీన సెయింట్ హోదా పొందారు. దీనిని పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు.
యెనుగందుల శంకర్
M.Sc(org.Chem)
అధ్యక్షులు
తెలంగాణా సామాజిక రచయితల సంఘం
సెల్ : 9440747614