గుర్రాల ముత్యాల హారాలు.
తేది .12-8-21.ముత్యాల హారాలు
341) తప్పులు సవరిస్తుంటడు
ఒప్పులు వివరిస్తుంటడు
ఆయన మనకు హితుడు
స్వయాన మన స్నేహితుడు !
342) మన క్షేమం ఆశిస్తాడు
సైయంటు వెంట వస్తడు
ఉదాహరణలు ఇస్తుంటడు
మన పనుల సరిచేస్తాడు !
343) నిజాలను గ్రహించు
తప్పొప్పుల సహించు
అందరిని ప్రేమించు
మన వారని భావించు !
344) మంచి దారిలో నడు
మంచి గీతమును పాడు
అంతా వస్తారు తోడు
వింటారులే నీ గూడు !
345) నాగ పంచమి పండుగ
చేయి నువ్వు నిండుగ
అంతా వస్తారు అండగ
కలసి చేస్తారు పండుగ !
346) పంచమి అంటే ఐదు
తెలుసుకో నీవు సాదు
నీవు చెడు చేయరాదు
అప్రదిష్ట మోయరాదు !
347) కారులో షికారు చేయి
సరిగా డ్రైవ్ చేయి
హుషారుగా ఉండవోయి
ఓమా బాటసారి !
348) మంచి ముహూర్తం చూడు
శుభకార్యం చేయి నేడు
నేను నీకే గా తోడు
తీస్తాను నేనిక దౌడు !
349) కొంగు బంగారమే
చూస్తే సింగారమే
అంగరంగ వైభవమే
అరవకు నీవు మే మే !
350) ఉంది బంగారం కొట్టు
హస్తవాసి చూపెట్టు
చంద్రహారం పట్టు
నీ జేబుల్లోకి నెట్టు !
351) వింటే భారతం విను
తింటే గారెలు తిను
నేనిక సై సై అను
కొడుకునే నీవిక కను !
352) దేవుడు చల్లని వాడు
అందరిని కరుణిస్తాడు
ఆపదల తొలగిస్తాడు
సంపదల అందిస్తాడు !
353) ఎవరిని ఏమి అనకు
చెడు మాటలను వినకు
బూతు చిత్రాలను చూడకు
గీతపటముంది గోడకు !
354) రాము రహీమ్ ఒక్కరే
మన చేతికి చిక్కరే
మనకు వారు దక్కరే
దక్కితే ఇక మొక్కరే !
355) ఎర్ర చొక్కా వేసుకో
ఈ తైలం పూసుకో
ఆ పూలను అందుకో
నీ మౌనం ఎందుకో !
356) పాపకు ఆకలేసింది
అందుకే ఏడుస్తుంది
అన్నంకై చూస్తుంది
పెట్టు అన్నం మస్తుంది !
357) ఎగురుతుంది విమానం
చేయకురా అవమానం
చేయి నీవు సన్మానం
వేయకు ఊహాగానం !
358) చార్మినార్ ఎక్కు
ఎక్కుటేనీలక్కు
పక్కమైసమ్మకు మొక్కు
తొలగిపోవు నీ చిక్కు !
359) గడ్డం పెంచావు దేనికి
అరువు ఇవ్వకు వానికి
ఈ బోనం ఎవరికి ?
సాహసం చేయి చివరికి !
360) దుస్తుల శుభ్రంగా ఉతుకు
వస్త్రంపై ఉన్నది మెతుకు
గంజి నీవు ఇక గతుకు
ఇదే కదా నీ బతుకు !
361) రాముని వెంటే సీత
ఆ సీత మా అజ్ఞాత
పరమ పావని సీత
ఇల మా కులదేవత !
362) ఆమెను మేం నమ్ముకున్నం
అందుకే గమ్ముగున్నం
నిత్యం ధ్యానిస్తున్నం
మేం పూజను చేస్తున్నం !
363) మాటలు కోటలెక్కు
చేస్టలు పీటకు చిక్కు
ఏమిటో మరి నీ లక్కు
ప్రేమించెనిన్ను సిక్కు !
364) ఆమె సిగమూగుతుంది
డప్పు భలే మోగుతుంది
ముందు జనం సాగుతుంది
అందు అలజడి అవుతుంది
365) టిఫిన్ నిజానంగా తిను
ముందున్న స్వీట్లు కను
చెప్తే ముచ్చట్లను విను
ఇచ్చ లేకుంటే మాను !
366) జనం రద్దీగా ఉంది
గుంపులో నేను బంది
ముందుకు వెళ్లాలని ఉంది
కాని వీలుకాక ఉంది !
367) మంచి ఆలోచన చేయి
పాలాభిషేకం చేయి
అందరిని పిలువోయి
నీకే అది మంచిదోయి !
368)మా తెలంగాణ ప్రాంతం
సశ్యశ్యామల ప్రాంతం
విన్నావా ఈ ఉదంతం
నా ప్రియమైన కాంతం !
369)ఎటుచూసిన పచ్చదనం
నానేలతల్లి వదనం
ఓవైపు ప్రమదవనం
మాది శ్రమజీవనం !
370) అల్లరి మూకల చెరకు
తుంటరిగా నువు మారకు
ఒంటరి గాకు చివరకు
కలసి ఉండు కడవరకు !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.