నేటి సమాజం
వింత ప్రపంచం
వింత ప్రపంచం
వ్యసనాల మత్తులో కొందరు
ఆయసాల విపత్తులో కొందరు
జోరైన హుషారుతో కొందరు
బలహీన స్థితిలో కొందరు
బాధలు పెడుతూ కొందరు
బాధలు పడుతూ కొందరు
బంధాల పాశంలో కొందరు
బరువైన హృదయాలతో కొందరు
ఎందరు ఎలాగున్నా
నువ్వు ఎర్రిగా ఉన్నావంటారు
పాశం వదలనిది
వేశం మారనిది
కాలం ఆగనిది
వైనం మారనిది
కానీ తరం మారినది
తలరాతలూ మారినవి
కొండల్లో ఉండే కుండపోత వర్షమంతా గుండెల్లోనే పొంగుతుంది
ఎండల్లో ఎండిపోయిన చెఱువులా
గుండెంతా ఆరిపోయింది
చల్లగా చూసే కన్నులు నిప్పులు కురుస్తున్నాయి
ప్రేమగా పలకరించే మనసులు కరువయ్యాయి
జాలి పడే మనసులు మాయమయ్యాయి
బంధాలు బరువయ్యాయి
సంబంధాలుతెగిపోయాయిదేముడిని మరిచారు
దారుణాలకు తెర తెరిచారు
ప్రకృతిని పాడుచేసారు
తదనుగుణంగా ఆరోగ్యాలను బలిచేసుకుంటున్నారు
పగప్రతీకారాలతో కాలం వెళ్ళదీస్తూ
తన్నుతాను పాడుచేసుకుంటూ ఇతరులను పాడుచేస్తున్న ఈ మనుషులవైనం మారదా
మారు రూపంలో ఉన్న రాక్షస
హృదయాలు కరుగవా
మంచి రోజులు రావాలి
మమతల హరి విల్లులు విరియాలి
అందరూ బాగుండాలి
అందులో మనం ఉండాలని ఆశిస్తూ
మీ
Y. రాధిక(గాయిత్రి),
మహబూబ్ నగర్.