సెల్లు ఫోను
1. సెల్లుఫోనులేని యిల్లులేదిలలోన
ఆనులైనునందె యన్నిపనులు
జరుగుచుండెజూడు జగతిలోచిత్రంబు
మాయలోనబడకు మనిషినీవు
2. వాహనంబునడుపు వదిలిఫోనునెపుడు
ముచ్చటించువేళ ముంచునిల్లు
మాటకన్నమిన్న మానవజీవితము
తెలిసిమసలుకొనుము తెలివితోడ
3. గడియవదలకుండ కాలంబుతెలియక
పగలురాత్రిఫోను పనికిచేటు
కంటిచూపుపోవు కళ్ళజోడునుదెచ్చు
వినికిడన్నదితగ్గి విలువబోవు
4. పడకనుండిలేచి పట్టేవుచరవాణి
మారుమాటలేక మనిషితోడ
బంధములుచెడేను బాధలుకలిగేను
భాగ్యమాటవినుము భవితవెలుగు
5. హస్తమందునేడు పుస్తకముబదులు
చూడచక్కగమరె చూపరులకు
ఆభరణమునయ్యి యలరారుచుండెను
మాయజేయుసెల్లు మహిమ లెన్నొ
✍️ తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి