వందనం ఓ సైనికుడా
నీ జీవన సమిధను
భారతమాత రక్షణకై సమాది చేసిన ఓ సైనుకులారా.........మీకు వందనం...
భరత మాత ఒడిన వీరమరణం పొంది
సేదతీరిన ఘనులు....
మీ త్యాగానికి ఎమిచ్చి రుణం తీర్చుకోవాలి....
దేశాన్ని వెలుగులతో నింపగా......
నీవు సమరపు సడిలో జ్వలించిపొయావు
నడిరాతిరి సైతం చీకటి తెరలను తృంచే ..
వెలుగువై.........అందరి గుండెల్లో గుబులు
మాయం చేసే.....దైర్యపు అక్షయపాత్రవునీవు...
యావత్ భారతమంతా .....నీకు వందనం అభివందనం
అంటుంది....
నా మనసు మాత్రం వేదనతో అక్షరాల్లో అశృవులను
ఒలకబోస్తు....నీకు నివాళులు అర్పించుతుంది...
వందనం...అభివందనం....ఓ అమరవీరులారా...
నిన్ను కంటిపాపల.....కాపాడిన నీ తల్లి కన్నిటిని,
నిన్ను గుండెలపై ఆడించిన....ఆ తండ్రి గుండెబరువును...
నీ ఇంటి మణిద్వీపంగా ఏడడుగులు నడచి....భరత మాతకు వెలుగు పంచిన ....ఉన్నతి...
త్యాగశీలి...హృదయపు....వేదనను తీర్చలేము...
నీ ప్రేమకు గుర్తులుగా మిగిలిన పసిమొగ్గలను.....
మనసారా ఆశీర్వదిస్తున్నాం....
నిన్ను సైనికుడిగా నడిపించిన...నీ ఆత్మీయులంధరికి
ఇవే మా వందనాలు....
దేశ సరిహద్దుల్లో మా కోసం పోరాటం చేస్తున్న
ఆత్మబంధువువు...
మాతృభూమికోసం ప్రాణత్యాగం చేసిన దేవుడివి....
నిన్ను తన ఒడికి చేర్చుకున్న మృత్యుమాత సహితం,
నీ వీరత్వం చూసి నిశ్శబ్దంగా అశ్రువుగా మారింది...
జన్మతః నీకు ప్రణమిల్లినా తీరదు నీ రుణం...
వందనం ఓ సైనుకుడా....నీకు వందనం
మీ
ఇడుకుళ్ళ గాయత్రి