భయం -అపజయకారిణి.lllవి. కృష్ణవేణి

భయం -అపజయకారిణి.lllవి. కృష్ణవేణి




భయం -అపజయకారిణి.

భయమే నిజమైన శత్రువు.

భయపడుతూ ముందుకు వెళ్లలేక
 నిందిస్తావు కదా కాలాన్ని..

ఒంటరితనమంటే భయం.

ఎందరో నారిమాణులు తమ మేదోసంపత్తితో 
భయాన్నివీడి రాజ్యాలను ఏలారు.
ఎన్నెన్నో పదవులను దక్కించుకున్నారు...
ఎంతో కీర్తిని గడించారు..

భయము వల్ల నష్టపోయేది నీవు మాత్రమే కాదు
సమాజం కూడా...
నీ భయము వల్ల సమాజాన్ని నిందించి 
కాలాన్ని చిన్నబుచ్చుతావు...

భయం మానసిక క్షోభను కలిగించి....
ఆత్మనూన్యత భావనను సృష్టించి..
మనోవేదనకు గురిచేసి..
మనోథైర్యాన్ని అణచివేసి...
 అపజయానికి తొలి ఆయుధంగా..
ఆరోగ్య రాహిత్యకారిణి గా..

అనారోగ్య సమస్యలలో మానసిక థైర్యాన్ని పోగొట్టి మరణమృదంగాన్ని సృష్టించే అసలైన 
మారణదారిణి గా..

నావల్ల ఏమీకాదు అనే అపనమ్మకాన్ని కలిగించి..
ఎవరయినా ఏమైనా అంటారనే భావనను  సృష్టించి..
ఏమైనా అనుకుంటారని వ్యతిరేక ధోరణిని కల్పించి....
 చేసే పనిమీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తూ..

చేసేది జరగదేమోనని అపనమ్మకంతో ముందు అడుగు వెళ్ళనీయకుండా చేస్తూ..

ఏమిసాధించలేక తనలో తానే కృషించిపోయేలా చేస్తూ..

దేనికి ముందుకు వెళ్లనీయకుండా  లోలోపల ఆందోళను కలిగింప చేసేది ఒక్క  భయం..
ఆ భయమే జీవితంలో నిజమైన బద్ద శత్రువు. 

వి. కృష్ణవేణి
వాడపాలెం
తూర్పుగోదావరి జిల్లా.



 

0/Post a Comment/Comments