బాల్యం
బ్రతుకు లో బాల్యం
భగవంతుని వరం
అమ్మ ఒడిలో ఆనందం
కేరింతల కోలాహలం
బ్రతుకంతా తీయని జ్ఞాపకం
నింగి లోని తారలు అందలన్న ఆత్రం
జగమే ఆనంద మయం
జనులంతా నా వాళ్ళే అన్న అభయం
హరివిల్లు వర్ణాల ఆకర్షణ ఫలం
లేనేలేదు కల్లాకపటం
రానే రాదు కుళ్లు కుతంత్రం
బాల్యం బంగారు ప్రపంచం
మానవ మనుగడకి స్వర్ణయుగం
తల్లిదండ్రుల గురువుల బోధనం
వారికి మార్గదర్శకం..
అందమైన బాల్యానికి వారి
బోధనలే ప్రాణం
బాలల బంగారు భవిత కి
అపురూపమైన బాల్యానికి
భరోసా ఇచ్చేది సంఘం
నేటి బాలలే రేపటి పౌరులు గా
తీర్చిదిద్దాలి మనం...
కావాలి మార్గదర్శకం
చేయూతనివ్వాలి దేశం
బాల్య స్మృతుల తో మురవాలి
అందరం...
భారత దేశ బాలల బాల్యం
మెరవాలి వజ్ర కిరణ మై
కావాలి ప్రపంచానికి ఆదర్శం...
పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
ప్రక్రియ;వచనం
చరవాణి:9490239581