'శాంతి కాముకుడు..మండేలా!'lll---సుజాత.పి.వి.ఎల్.సైనిక్ పురి, సికిందరాబాద్.

'శాంతి కాముకుడు..మండేలా!'lll---సుజాత.పి.వి.ఎల్.సైనిక్ పురి, సికిందరాబాద్.

'శాంతి కాముకుడు..మండేలా!'


నిశి ఖండాన ఉదయించిన
రవి కిరణం..
జాతి వైషమ్య నివారణకై
వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటం చేసిన యోధుడు..
శత్రువుల మనసును గెలుచుకున్న శాంతి కాముకుడు..
ప్రపంచ దేశాల మన్ననలందుకున్న భారతరత్న బిరుదాంకితుడు..
సహన మార్గంలో చరించిన గాంధేయవాది..
దక్షిణాఫ్రికా ప్రజాస్వామ్య తొలి అధ్యక్షుడు..
ప్రజలందరి కోసం సాయుధ పోరులో దివిటీలా వెలుగులు నింపిన నల్ల సూరీడు..
అణగారిన వర్గాల ఆపద్బాంధవుడు..
అత్యుత్తమ రాజనీతిజ్ఞుడు..
మహా మనీషి..మహోజ్వల చరిత్రలో సువర్ణశోభిత శిల్పం..'నెల్సన్ మండేలా'!

---సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.

0/Post a Comment/Comments