అన్నధాత
నిత్య కృషీ వలుడు రైతన్నా!
నిరంతర శ్రమజీవి రైతన్నా!
దేశానికి వెన్నెముక రైతన్నా!
కోట్లాది జనులకు ప్రాణధాత రైతన్నా!
కండలు కరిగించుతూ రైతన్నా!
ఎండలో మాడుతూ రైతన్నా!
గంజి మెతుకులనారగిస్తూ రైతన్నా
ఆలు బిడ్డల డొక్కలు మాడ్చే రైతన్నా!
గోచిని చెక్కి, తలకు రుమాలు చుట్టి
హలమును పట్టి, కావడెద్దుల కట్టి
పొలమును దున్ని, ఒడ్డులను గట్టి
గొర్రును తోలి, మడులను కట్టి
నారును పోసి , నాట్లను వేసి
నీరును పారించి , మందులు చల్లి
పంటలు పండించు రైతన్నలకు
ఏమి మిగులు తుండే నేడు అన్నధాతలకు!
భూముల సాగు చేయు రైతు
పేరుకే గొప్ప మహా రాజు రైతు
రైతు వెనకాలే ఉంటాడు ఆంబోతు
శవాలపై చిల్లర ఏరుకునే తిరుగుబోతు!
కల్తీ విత్తనాలతో కలవరం పుట్టిస్తుండే
పలానా పంటే వేయాలని వత్తిడి తెస్తుండే
ఎరువులు సమయానికి అందకుంటుండే
పండించిన పంటలకు గిట్టుబాటుధర లేకుండే!
కండలు కరిగించుతూ రైతన్నా!
ఎండలో మాడుతూ రైతన్నా!
గంజి మెతుకులనారగిస్తూ రైతన్నా
ఆలు బిడ్డల డొక్కలు మాడ్చే రైతన్నా!
గోచిని చెక్కి, తలకు రుమాలు చుట్టి
హలమును పట్టి, కావడెద్దుల కట్టి
పొలమును దున్ని, ఒడ్డులను గట్టి
గొర్రును తోలి, మడులను కట్టి
నారును పోసి , నాట్లను వేసి
నీరును పారించి , మందులు చల్లి
పంటలు పండించు రైతన్నలకు
ఏమి మిగులు తుండే నేడు అన్నధాతలకు!
భూముల సాగు చేయు రైతు
పేరుకే గొప్ప మహా రాజు రైతు
రైతు వెనకాలే ఉంటాడు ఆంబోతు
శవాలపై చిల్లర ఏరుకునే తిరుగుబోతు!
కల్తీ విత్తనాలతో కలవరం పుట్టిస్తుండే
పలానా పంటే వేయాలని వత్తిడి తెస్తుండే
ఎరువులు సమయానికి అందకుంటుండే
పండించిన పంటలకు గిట్టుబాటుధర లేకుండే!
రైతు బంధు పథకం భూస్వాములు మేస్తుండే
పెట్టుబడులకు రైతులు అప్పులే తెస్తుండే
పంటల కొచ్చిన డబ్బు అప్పులు తీరకుండే
అప్పులు తీరక అన్నధాతలుఅవని వీడుతుండే!
ఆరుగాలం చేసే కౌలుదారుకు
రైతు బంధు పథకం ఎందుకు
భూస్వాముల మేపేటందుకు
రైతుల అప్పుల పాలు చేసే టందుకు
ఆపై ఆత్మ హత్యల పురికొల్పేటందుకు!
జై జవాన్! జై కిసాన్! జై విజ్ఞాన్!
మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్