పొరుగు తో పోరు కొరివి తో పోరుlllడా వి.డి.రాజగోపాల్lll9505690690

పొరుగు తో పోరు కొరివి తో పోరుlllడా వి.డి.రాజగోపాల్lll9505690690

పొరుగుతో పోరు కొరివితో పోరే

నలుగురితో మంచి  
ఎంత మంచి సుగుణం
మనం అందుకని
ఎవరికీ ఏమి ఇవ్వక్కర్లేదు

ఓ చిరునవ్వు
ఓ పలకరింపు
ఓ చేయూత

చేయూత అంటే
అప్పిచ్చి ఆదుకొమ్మని కాదు
ఆపదలో ఆదుకొమ్మని

శిశుపాలుడు నిష్కారణంగా ఆ పరంధాముని నిందించి ప్రాణాలే పోగొట్టుకుంటాడు

నవనందులు అకారణంగా చాణక్యునిపై నోరుపారవేసుకొని  భూస్థాపితులవుతారు

రైలెక్కగనే పక్క ప్రయాణీకునితో
చిట పటలు,
ఉదయాన్నే పొరుగు వారితో
రుస రుసలు,
పొలం గట్టు తగాదాలు,
కారు అడ్డంగా నిలిపి
పక్కకు తియ్యమంటే మండిపాటు,
చర్చా వేదికల్లో తాను చెప్పిందే
వేదం అని వితండవాదం,
అపార్ట్మెంట్ లలో 
అయిన దానికి కాని దానికి 
నోరు పారేసుకోవటం 
తెస్తుంది చేటు పెంచుతుందీ బి.పి.

మన ప్రాణాలు గాలి బుడగలు,
ఎవరితో ఎప్పుడు ఏపని పడుతుందో ఎవరికి తెలుసు,
పనికిరాదని పడవేసిన 
ఓ చెక్కముక్క, 
జలపాతంలో కొట్టుకుపోయే నిన్ను 
కాపాడ వచ్చు, 
నడిరోడ్డులో ప్రమాదంతో 
కొట్టుమిట్టాడే నిన్ను 
మూలిగే నీ ధనం కాపాడ గలదా ?
నీవు అసహ్యించుకొనే ఓ యాచకుడు 
కాపాడ వచ్చు,

అందుకే కోరు పొరుగు పొందు,
ఆపదకు పొరుగే మెరుగు
పొరుగుతో పోరు 
కొరివితో  పోరే సుమా!

డా వి.డి.రాజగోపాల్
9505690690

0/Post a Comment/Comments