*ఏది.. గొప్పదనం..?2*
ప్రదర్శనా బుద్ధి తో గల గొప్పదనం అది ఇవాళ కాకున్నా రేపు పట్టుబడుతుంది.!? అందుకే "ప్రదర్శన బుద్ధి"కి చాలా దూరంగా ఉండాలి. నిజాయితీతో కూడిన నిజమైన గొప్పదనాన్ని మాత్రమే ఆశించాలి. వాస్తవానికి గొప్పతనాన్ని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఏమంటే మనం చేస్తున్న పనులు మనల్ని గొప్పగా సమాజంలో నిలబెడతాయి. కేవలం "గొప్ప" కోసమే మనం పనులు చేయడం అన్నది 'స్వార్ధం'తో కూడినది అవుతుంది..!? అందుకే 'సత్కార్యాలు' నిస్వార్థంతో,సమాజ సేవగా,దాన తత్పరతతో..దైవికమైనవిగా,పుణ్యకార్యాలు గా..భావిస్తూ చేయాలి,తరచూ చేస్తుండాలి.అంతేకానీ గొప్పదనాన్ని ఆశించకూడదు..! మరియు ప్రచారం చేసుకోవడం కూడా తగదు. అందుకే "దేవుని"కి సంబంధించిన ఒక 'పుణ్య కార్యం'గా భావిస్తూ ఈ సమాజంలో మనం మంచి మంచి పనులు చేస్తూ ఉండాలి. "గొప్పదనం" అనే ని మాటను మరచిపోవాలి. గొప్పదనం ఆశించి చేసే పనులు ఎక్కువ కాలంప్రజల జ్ఞప్తిలో ఉండవు.
"నిస్వార్థం"గా చేసే కార్యాలే ఎల్లప్పటికీ అజరామరంగా నిలిచి ఉంటాయి..!
*విన్నర్*
*ముహమ్మద్ ముస్తఖీమ్,*
కొల్లాపూర్ ,నాగర్ కర్నూలు జిల్లా.