పేరు: సయ్యద్ జహీర్ అహ్మద్
ఊరు: కర్నూలు
చరవాణి: 9505152560
అణచివేతలో రైతన్న
^^^^^^^^^^^^^^^^^^^
చట్ట వ్యతిరేక నిరసనకు
అడ్డుగోడలు నిరంకుశ వైఖరులు
ఉద్యమస్ఫూర్తి కొలది ఊపంది
ఊరట కలుగుతుందనే రైతన్న!
వేసవి వడగాల్పుల విరసనలో
వాన జల్లులో తడిసిన వలస పక్షి
పొగమంచు బారిన బడుగు కీటకం
చీడ పట్టిన చెక్కు చెదరని సంకల్పం
మెట్ట మడి మీద సాగుకుద్యమించిన
అన్ని విధాతకు నమో నమః.
కరెంటు ఇంటర్నెట్ ఆహారం
నీటి సరఫరా శౌచాలయం విధ్వంసం
ట్రాక్టర్ల క్రింద నలిగిన మట్టి బొమ్మలు
వెన్నెముకల క్రింద అంపశయ్య
అధర్మ అన్యాయం దురాగత ఏలిక
వధ్య శిలపై బలిపశువు నిర్ధాక్షిణ్యంగా
కత్తి కంటే కౄరమైన యోచన!
మహిష మస్తిష్కపు పొలాలపై
క్రమ్ముకున్న మదబలిసిన దుర్నీతి
ఆధిపత్య శూరత్వం అరాచకత్వం హానికి హామీలేక చట్టబద్ధం చేయలేని
హెచ్చరిక!
రైతన్న ఒక్క సాలు సాగు నిరసిస్తే
మెతుకులు సారం నోటికి మట్టి బెడ్డ!
***