ఆరోగ్యమే మహభాగ్యం
మంచి ఆరోగ్యం
అదే నీకు అసలైన వరం
దైవం ఇచ్చిన శరీరం
ఇదే నీ భవితకు సాధనం
నీ మనుగడకు కావాలి ఆరోగ్యం
దానిని చేయకు అలసత్వం
కోరి తెచ్చుకోకు కొత్త రోగాలు
అసలు మరచిపోకు పాత నియమాలు
తినే తిండిలో పెట్టు నీ శ్రద్ధ నూరుపాళ్ళు
పాశ్చాత్య ప్రవాహంలో పడి
వీడకు పాత అలవాట్లు
లేలేత కిరణాలతో తానమాడి
ప్రకృతిలో కలిసిపో
సోమరితనం చూపక
శ్రమ సమరం చేసి
పువ్వులాగ వికసించు
పరిమళంతో పరవశించి
నిండు నూరేళ్లు జీవించి తరించు.
---ఐశ్వర్య రెడ్డి గంట
ఊరు: హైదరాబాద్
చరవాణి:8555069265