దమ్ము కొట్టకుlllడా.రామక కృష్ణమూర్తిlllబోయినపల్లి,సికింద్రాబాద్.

దమ్ము కొట్టకుlllడా.రామక కృష్ణమూర్తిlllబోయినపల్లి,సికింద్రాబాద్.

దమ్ము కొట్టకు
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,సికింద్రాబాద్.

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ 
అన్న గిరీశం మాటేమో గానీ,
పొగాకు చుట్టేసిన బతుకులెన్నో!
సరదాకు మొదలైన వ్యసనం
మరణానికి చేరువ చేసింది.
రింగు రింగులుగా వదిలిన‌ పొగ
చితిపేర్చి కాష్ఠాన్ని‌ రగిలించింది.
ఊపిరి అందకుండా చేసి,
ఊపిరితిత్తులను ఛిద్రం చేసి,
దగ్గుతో నరకాన్ని చవిచూపింది.
బీడీ అయినా,సిగరెట్ అయినా,ఘంటచుట్టయైనా క్యాన్సరే.
యువతను నిర్వీర్యమొనరించి
శారీరకశక్తిని అపహరించింది.
అస్థిపంజరం మిగిల్చింది.
పొగలేని బతుకే మంచిదనిపించింది.


0/Post a Comment/Comments