పర్యావరణ రక్షణ
(ఇష్ట పదులు)
1
పచ్చని చెట్లు పెంచు పరిసరాలు చల్లగ
స్వచ్ఛమైన గాలీ శ్వాస కొరకు కావలె
అవని లోన అందము హరితము నాల్గు దిశల
నీరు గాలి నేలా నిర్మలంగ చూసుకొ
అడవులు రక్షించుము ఆదుకొను జీవులను
సకల జీవరాసులు చక్కగా జీవించు
ప్రకృతికి అపకారము వికృతమైన పనులతొ
తరువులు నరక వద్దు వరములు మనకు కదా
2
ప్రకృతి విషతుల్యమై పలు సమస్యలు తెచ్చె
ప్లాస్టిక్ వాడకూపవిత్రంగా జీవించు
పరిశ్రమల మురికితో పాడగును నది జలము
వాతావరణములో వాహనాల పొగలతొ
సమతుల్యము ఉంటే చక్కగా జీవనము
నీరు లేక జీవులు నిమిషమైన నిలువరు
పుడమిపై కలుషితము పెను భూతంగ నిలచె
పర్యవరణ రక్షణ పవిత్రంగ భావించు
-- అద్దంకి లక్ష్మి,
ఊరు ముంబై.