మన్నెం పులి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు )

మన్నెం పులి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు )


మన్నెం పులి

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడు
తెలుతనాన్ని రుచి చూపించినవాడు
భరతమాత దాస్యశృంఖలాలు పగులగొట్టిన వాడు
బ్రిటిష్ గుండెల్లో దావాగ్ని నింపినవాడు

మన్నెం లో పుట్టి
మన్నే వీరుడిగా
విప్లవశంఖం ఊది
మన్నెం ప్రజల హక్కులకు పోరాడి
బానిస విముక్తికి కృషి చేసి
అరాచక శక్తుల ఆటలు కట్టించి
మన్నెం పులిగా పేరుగాంచిన ధీరుడు

దున్నేవాడిదే భూమి అనే నినాదం తో
పరాయివానికి పన్ను ఎందుకు కట్టాలని
సొంత భూమి కి శిస్తు కట్టమని
సరియైన పనికి సరియైన కూలి ఇవ్వాలని

మన్నెం ప్రజలలోచైతన్యం కల్పించి
మన్నెం ప్రజలకు ధైర్యం తెప్పించి
మన్నెం ప్రజలను సమైక్యత పరచి
మన్నెం ప్రజల మేలు కోరి

ఎదిరించి ఎదురుతిరిగి
భారతమాతా కి జై అంటూ
అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి
ఆంగ్లేయుల గుండెల్లో సింహ స్వప్నమై
భారతీయుల గుండెల్లో చిరస్మరనీయుడైన దేశభక్తుడా అల్లూరి నీకు వందేమాతరం

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు టీచర్
           విజయనగరం జిల్లా
           9441530829

0/Post a Comment/Comments