ముత్యాల పేరులు (కవిత). బాల మిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి.

ముత్యాల పేరులు (కవిత). బాల మిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి.

ముత్యాల పేరులు
-------------------
ఆకాశంలో మెరిసింది
అవకాశంతో మురిసింది
అందించే నింగికి అందం
స్పందించే సింగిడి బంధం. !

తుమ్మెదలు ఎన్నో నిల్చి
పువ్వులపై యద వాల్చి
మధువును త్రాగేస్తున్నవి
ముదమున వూగేస్తున్నవి !

సీతకు తిలకం ముద్దు
మాపాపకు పాపిట కద్దు
మెడకు హారం శింగారం
మేడకు ద్వారం బంగారం !

ప్లాస్టిక్ వినియోగం
ప్రాణానికి శని యాగం
అవగాహన కలిగిద్దాం
అరికడితే సంతోషిద్దాం !

ఎంచుకో ఆరోగ్య అలవాట్లు
పెంచుకో నీ ఆరోగ్యం ఫీట్లు
మదిలో ఆనందం పెంచుకో
ఆయుష్మాన్ భవనిపించుకో !

పరిసరాలు పరిశుభ్రంగా
ప్రకృతి ఇల సహజాతంగా
అభిష్టంగా నీవు చేసిచూపు
నిర్దిష్టంగా ఉండాలిక రూపు !

ఏది సహజమైన  పవనం
లేదు సహజమైన భోజనం
లేనేలేదు సహజమైన నవ్వు
కలుషిత యాంత్రికం పువ్వు !

ట్రాఫిక్ నియమాలను మీరొద్దు
మీరితే జరిమానా కట్టుటకద్దు
చేస్తారు ఎందుకు రాద్ధాంతం 
గౌరవించే చట్టాల సిద్ధాంతం !

అమ్మగార్లు అంతా టీవీలకు
నాన్నగార్లు అంతా సెల్ఫోన్లకు
పిల్ల జిల్లా అంతా  ఆన్లైలకు
కలి ఆకలి కాలం విలువలు !

వరకట్నం ఎవరి ధనం అని
సంగ్రహించే నీఇంధనం కని
చేయకు నీవు ఆశల వమ్ము
నిమ్మలంగ ఇక ఉండనిమ్ము !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9492387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments