మనిషి బతుకుతాడు ---పిల్లి.హజరత్తయ్య

మనిషి బతుకుతాడు ---పిల్లి.హజరత్తయ్య


"తక్షణ కర్తవ్యం"
     
మనిషిని వెంటాడుతున్న కరోనా భూతం
మనసును భయబ్రాంతులకు గురిచేస్తూ
మృత్యు ఘంటికలు నిర్విరామంగా మ్రోగిస్తుంది

భయపడే కొద్దీ భయపెట్టే లోకంలో
బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే కంటే
బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది

కరోనా వార్తలతో కల్లోలం చెందక
కరోనాకు సంబంధించిన పూర్తి సమాచారం పై
కసరత్తు చేసి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిది

స్వీయ నియంత్రణ పాటిస్తూనే
వైద్యుల సహకారాన్ని సకాలంలో తీసుకుంటే
మృత్యువుకైనా ముచ్చెమటలు పట్టించడం సాధ్యమవుతుంది

మృత్యువుని గెలిచిన వారి గాథలను వింటూ
మనో నిబ్బరమును ప్రోది చేసుకుంటే
ఎలాంటి స్థితిలో ఉన్నా మనిషి బతికితీరుతాడు

ఆశావాహా దృక్పథం, మొక్కవోని ఆత్మ ధైర్యంతో
ముందుకెళ్లడమే మన తక్షణ కర్తవ్యం

...........................................
--- పిల్లి హజరత్తయ్య,
శింగరాయకొండ,
ప్రకాశం.

0/Post a Comment/Comments