అబ్దుల్ కలాంకు సలాం
--------------------–-----------
సర్వోన్నత వ్యక్తి
సాంకేతిక శక్తి
నిలువెల్లా కలాం కు
దేశమనిన భక్తి
కొనితెచ్చెను కీర్తి
అందరికీ స్ఫూర్తి
అబ్దుల్ కలాం గారు
ఆదర్శమూర్తి
శాస్త్రవేత్త ఆయెను
రాష్ట్రపతీ ఆయెను
" మ్యాన్ ఆఫ్ మిస్సైల్"అతడు
భారతరత్న పొందెను
ఘనం వారి సేవలు
బహు మహానుభావులు
భారతమ్మ పుత్రుడు
భారతీయ భానుడు
పుట్టెను మచ్చలేని
మారాజు ఈరోజు
అబ్దుల్ కలాంకు సలాం
గుండెలో ప్రతిరోజు
--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు