అందమైన లోకం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అందమైన లోకం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

అందమైన లోకం..!(కవిత)
************************

అందమైన ప్రపంచం..!
అందమైన ప్రకృతి చందనం..!
ఆ పూలు పూసిన అందమైనచెట్లు..!
చెట్ల కొమ్మల పై వాలిన ఆ పక్షుల గుంపులు,కిలకిలలు..!
నేలపై పరిచిన ఆ పచ్చగడ్డి తివాచీ..!
ఆ అందమైన రంగు రంగుల దుముకుతున్న కుందేళ్ళు..,ప్రకృతి దేవి పిల్లలు..!
ఆ ఎత్తైన గిరుల పై అలరారినట్లు తరులు..!
ఆ కొండపై ఎవరికోసమో నన్నట్లు అనంత నిరీక్షణ తో, డేగల తీవ్ర చూపులు..!
మిరుమిట్లు గొలిపే ఆ చుక్కల నీలి ఆకాశం..!
ఆ జాబిలి పండు వెన్నెల..!
జగత్తు హాయిగా నిదురలో ఊగుతోంది ఊయల..!
ఏమి ,ఈ చల్లని రేయిరో..!??
ఏమి ఈ అందమ్ముల లోకమో..!?

రచన:-
✍🏻విన్నర్,
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments