గురువు ------ శ్రీపాల్

గురువు ------ శ్రీపాల్

శ్రీపాల్
గ్రా: గోవింద్ పేట్
మం: ఆర్మూర్
జి: నిజామాబాద్

........ గురువు........

తల్లి గర్భములో గ్రహణ శక్తిని పెంచుకొని
లోకము చూసే శూన్యం నేను
ఆ శూన్యమైన నాకు జ్ఞానము ఇచ్చి
వెలుగు వైపు నడిపించే జ్ఞానజ్యోతి "గురువు "

అంధకారమయ జీవితంలో
జ్యోతి వెలిగించే
ప్రేరణ కాంతి "గురువు"...
 
ప్రతికూల విషయమైనా
అనుకూల  మార్గాన్ని 
చూపే మార్గదర్శి "గురువు"

బురదలో పడిన కొడుకును అమ్మ పైకి లేపి
బురదను కడుగు
నాలోని దోషము అనే బురదను కడిగి
దోష విసర్జన చేయు యోగి "గురువు"

ఏ విధంగానైతే చందనం అరిగి
సుగంధం వెదజల్లునో
నాలో చెడు స్వభావమును అరగదీసి
మంచి స్వభావము పెంచు చందనం "గురువు"

నాలో జీవన వికాసాన్ని,ఊష్మను నింపి
జీవన దృష్టి ఇచ్చే 
వాత్సల్యం "గురువు"

నేను అనే వాడిని లఘువైతే
ఈ లఘువును
గురువు  చేసే ఘనుడు "గురువు".....

శిష్యుడు అనే వాడు ఒక కిరణమైతే
ఆ కిరణాల కాంతి పుంజం
"గురువు" 
అందుకేనేమో
గురువు లేని జ్ఞానం ఫల రహితం
అర్ధరహితం అనేది..
కాబట్టి 
గురువే బ్రహ్మ , గురువే విష్ణు,
గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం
అని ఘోషించింది  భారతీయ సంస్కృతి....

 ......శ్రీపాల్...
 


0/Post a Comment/Comments