ఉషోదయం
------------------------------------------
సాహిత్యం జీవిత వృక్షానికి పూసె పువ్వు
సాహిత్యం జీవన యానాని కి చూపే బాట
సాహిత్యం మానవ జీవితానికి శుభోదయం
సాహిత్యం మానవ జీవిత ప్రయాణ నికి ఉషోదయం
సాహిత్యంమానవ వికాసానికి ఆభరణం
సాహిత్యం మానవుని ప్రతి రోజు శుభోదయం
రాయి ఆదిమ మానవుని ఆయుధం
సాహిత్యం ఆధునిక మానవుని ఆయుధం
సాహిత్యం ఒక తత్వం
సాహిత్యం ఒక బహుళత్వం
సాహిత్యం ప్రజాస్వామ్య న్ని ఆదరిస్తుంది
సాహిత్యం నియంతృత్వాన్ని ధిక్కరిస్తుంది
సాహిత్యం ప్రజాస్వామ్యం, సామ్యవాద లకు సహకరిస్తుంది
సాహిత్యం ఆన్యాయం, అక్రమాలనుఎదిరిస్తుంది
సాహిత్యం జాతీయ భావాన్ని కలిగిస్తుంది
సాహిత్యం విప్లవాన్ని సైతం స్వాగతిస్తుంది
సాహిత్యం ప్రాచినం,నవీనముల మేళవింపు
సాహిత్యం అస్తికులకు ,నాస్తికుల కు ఆకర్షణ
సాహిత్యం ధర్మ ప్రభోధకులకు గాండీవం
సాహిత్యం ప్రవచకర్తల ఆయుధం
సాహిత్యం కరుణ గలవాని కైనా
కర్కాటకునికైనా రసభరితం
అందుకే సాహిత్యం నవరసభరితం
అందుకే సాహిత్యం మానవాళికి అమృతాభారణం
రచన
సంకెపల్లి శ్రీనివాస రెడ్డి
రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ(కాకతీయ)ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీపీసీయల్ ఏ)
సెల్ 9000245448.