"మనసు" గొప్పదనం..!
మనసులేని పని ఎన్నటికీ
మంచి రూపం దాల్చుకో దు..!
మనస్సు లేకుండా చేసి ఉన్న
పనిలో జీవం ఉండదు..!
మనస్సు పెట్టి చేసిన పనిలో
కళాత్మకత నిండి ఉంటుంది..!
మనస్సు తో చేసిన పనులు,
మంచిగా అందరి దృష్టిని ఆకర్షించును..!
మనస్సు పారేసుకుంటారు మనుష్యులు,
మనసైన పనులకు..!
"మనసుంటే మార్గం ఉందని"
మనస్సు గొప్పదనం ఏనాడో చెప్పేశారు , మహనీయులు..!
మనస్సు మాయల మారి కూడ,
కనుక బుధ్ధి తో మసలుకోవాలి..!
మంచి చెడుల్ని విశ్లేషించే మనస్సుని
మనమందరం రూపొందించుకోవాలి..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.