విలపిస్తున్న భూమాత..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

విలపిస్తున్న భూమాత..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

విలపిస్తున్న భూమాత..!(కవిత)
********✍🏻విన్నర్*******
దేవుడు,ఈ భూలోకమును,
మంచిగా సృష్టిస్తే..
ఏమయ్యింది..!??
కలుషితం..కల్మషం..!
నాశనం,సర్వనాశనం..!
దుష్టులు,దుర్మార్గులు,
భూలోకమును ఇష్టమొచ్చిన 
రీతిలో చెడగొట్టి పడేశారు..!
రక్త పాతాలు ప్రవహింప జేశారు..!
ఎందరినో చంపి భూమిని భ్రష్టు చేశారు..!
అమాయకులను,
నిర్దోషులను ,
అభాగ్యులకు చేటు చేశారు..!
రకరకాల స్వార్థములతో..భూమాతను చంపేశారు..!
భూమాత ప్రియ బిడ్డలను ఘోరాతి ఘోరంగా బలి తీశారు..!
రక్తం చవిచూడని ఈ పవిత్ర దేవుని గడ్డను ఛిద్రం చేసేశారు..!
ఇప్పుడు విలపిస్తున్న ఈ భూమాతను ఎవరు 
ఓదారుస్తారు..!??
మునుపటి తన రూపం కావాలంటున్న ఆమె కోరికను ఎవరు తీరుస్తారు..!??
✍🏻విన్నర్
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments