యువత కర్తవ్యం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

యువత కర్తవ్యం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

యువత కర్తవ్యం 

              విసిగి విసిగి ఎండలో నుండి వచ్చి రవి దిగాలున కుర్చీలో వాలి పోయాడు.అమ్మ మంచినీళ్లు ఇయ్యమ్మ అని దీనం గా అడిగాడు. వెంటనే తల్లి గబగబా వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. సెదతీర్చుకున్నాడు.తల్లి వైపు ఒకింత భాద గా చూసాడు.ఈ ఇంటర్వ్యూ కూడా పాస్ కాలేదమ్మ అని నిట్టూర్చాడు.
              రవిని వాళ్ళ అమ్మ నాన్న కాయకష్టం చేసి పెంచారు.వారి కష్టమంతా రవి చదువుకె ఖర్చు చేశారు.రవి చదువు కూడా అంతంత మాత్రమే.రవి ఫైనల్ ఇయర్ చదువు కూడా కరోనా పుణ్యం తోనే పాస్ అయ్యాడు.ఈ కరోనా కాలం లో మేధావులకే ఉద్యోగాలు కొరత గా ఉన్నాయి.మరి రవి లాంటి కుర్రాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో మరి. ఇప్పిడిప్పుడే తన శ్రద్దలేని చదువును తలచుకుంటు భాద పడుతున్నాడు.
            తల్లి మాత్రం ఏమాత్రం కుంగి పోకుండా రవికి ధైర్యం చెప్పుతున్నది.తండ్రి కూడా రోజు కూలి ఒకరోజు పని ఉంటుంది ఒకరోజు కాళీ ఉంటుంది అయినా కొడుకు విషయంలో అతి జాగ్రత్తగా పెంచాడు.చదువులో ఆసక్తి తక్కువ అయినప్పటికీ కాస్త బుద్ధిమంతుడే.
            అయితే పరిస్థితులను అవగాహన చేరుకొని మెలిగేతత్వం.తను ఆశ్రద్ద చదువు వల్లనే ఇలా అయ్యిందని భాదపడుతూనే కర్తవ్యం తో ముందుకు నడిచాడు.ఉదయాన్నే పేపర్లు పాలు పాకెట్స్ వేసుకొని తల్లిదండ్రులకు చేదోడు వాదోడు అయ్యాడు.జరిగిందేదో జరిగిందని జరగబోయేది మనచేతులోనే ఉందని ఆత్మవిశ్వాసం తో ముందుకు నడచి ఇంటిలో ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించాడు
            ఇలా పార్ట్ టైం పనులు చేసి రాత్రి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు.అనతి కాలం లోనే బాంక్ ఉద్యోగం సంపాదించాడు. తను కోల్పోయింది అతి త్వరలో తెలుసుకొని విజయపదానికి మార్గం సులభతరం చేసుకున్నాడు. తల్లిదండ్రులు ను ఆనందపరిచి యువతరానికి ఒక ఆదర్శం అయ్యాడు.వైఫల్యాలకు కాలమని పరిస్థితులు అని నిందించకుండా కర్తవ్యం తెలుసుకొని విజయం పొందాడు.అందుకే యువత కర్తవ్యాన్ని గుర్తించాలి అని ఋజువుచేశాడు.

రచన: పసుమర్తినాగేశ్వరరావు
           టీచర్ సాలూరు
            విజయనగరం జిల్లా
             9441530829


0/Post a Comment/Comments