" మంచి" కావాలి..!
నాలుగు కాలాలు నిలిచే,
పదుగురు మెచ్చే..
మంచి కావాలి..!
ఈ లోకంలో మంచికున్న స్థానం ఎప్పటికీ చెరిగి పోనిది..!
మంచి పనులను సత్కార్యాలుగా ఆ దేవుడు కూడా సంతసించును..!??
అందుకే..
మంచి కావాలి..!
కాని నేడు చెడు లోకం నిండా నిండుకొని ఉన్నది,
చెరువు నిండా కప్పలున్నట్లు..!??
లోకంలో ఈ రీతిగా చెడు రాజ్యమేలుతోంది..!
కాని,
మంచి కావాలి..!!
కాని చెడుకు ఉన్న కాల పరిమితి తాత్కాలికం,
ఐనా, మంచి కావాలి..!
మంచితో లోక కల్యాణం
జరిగి తీరుతుంది..!
దానిని ఏ దుష్ట శక్తీ ఆపజాలదు..!?
దేవుని కృపతో, మంచివాళ్ళ.. సాంగత్యంలో
మంచి అభివృద్ధిని సాధించాలి..!
అందుకే..
మంచి కావాలి..!
లోకం మంచితో విలసిల్లాలి..!
మంచి కావాలి..!!
లోకం మంచిగా మారాలి..!
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా.