స్పందన --- ఇడుకుల్ల గాయత్రి, హైదరాబాద్, మదీనాగూడ.

స్పందన --- ఇడుకుల్ల గాయత్రి, హైదరాబాద్, మదీనాగూడ.


స్పందన
మనసు ఎందుకు గాయాలకు జ్ఞాపకాల లేపనం పూస్తుంది 
ఆ లేపనం పూసిన ప్రతి సారీ మళ్లీ కొత్త గాయమవుతుంది
మనసు ఆలోచన స్పృహలని కోల్పోతుంది 
హృదయం పదాల సరళిని కూర్చోలేక నిశ్శబ్దమై పోయింది 
ఏమో ఏ అక్షర కుసుమాలు విరియా
లో గాయం మాన్పడానికి

బ్రహ్మ  రాసే  పిచ్చి రాతలు అన్ని, ఆయనే వచ్చి మరి తుడవాలి 
మనసుకు శాంతి కరువైంది, మనిషికి ధైర్యం కరువైంది 
మంచి మాటల తూటాలతో ఈ హృదయాన్ని తాకి వ్యాక్సిన్ లా పని చేస్తే గాని మరి ఈ జీవనగమనం మారదు 
అయ్యో నా కవితను విషాదం ఏదో అల్లుకుంది అని అనుకోకండి తాకిన ఎదురుదెబ్బలు అక్షరాల్లో ఒలకబోస్తోంది 
అంతే సుమీ గాయాలు మానితే గాని హృదయం స్పందించేలా లేదు

మీ 
ఇడుకుల్ల గాయత్రి,
హైదరాబాద్,
మదీనాగూడ.


(ప్రతిలిపి  అనే సాహిత్య యాప్ లో  209 రచనలు చేశాను. కథలు, కవితలు, పాటలు రాయడం అభిలాష. ప్రచురణ అయిన మొదటి పుస్తకం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర)

0/Post a Comment/Comments