జాతిని పీడించే ఓ జలగలారా! నీతిలేని ఓ రాతి బొమ్మలారా ! వినండి...(హాస్య కవిత)...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

జాతిని పీడించే ఓ జలగలారా! నీతిలేని ఓ రాతి బొమ్మలారా ! వినండి...(హాస్య కవిత)...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

జాతిని పీడించే ఓ జలగలారా!
నీతిలేని ఓ రాతి బొమ్మలారా ! వినండి
(హాస్య కవిత)

జై పాతాళభైరవి ! 
నరుడా ఓ నరుడా ! ఏమి నీ కోరిక ?
రాజకీయాల్లో రాణించేదెట్లు తల్లి ?
అదెంత పనిరా డింభకా !
అసమ్మతిచిచ్చును రేపవలెరా !
అవినీతిలో ఆరితేరవలేరా !

కుర్చీకుమ్ములాటలో గెలిచేదెట్లు తల్లీ?
అదెంత పనిరా డింభకా !
నోట్లగాలంతో ఓట్లచేపలు పట్టవలెరా !
రిగ్గింగ్ చేయమని గూండాల్ని బెగ్గింగ్ చేయవలెరా !

కుర్చీలో కూర్చోగానే కుబేరుడయ్యేదెట్లు తల్లీ ?
అదెంత పనిరా డింభకా !
కోట్లు కోట్లు అర్జించవలెరా !
కొంపలు కొన్నైనా కూల్చవలెరా !

దోచుకున్న ప్రజాధనాన్ని దాచుకునేదెట్లు తల్లీ?
అదెంత పనిరా డింభకా !
హార్ట్ సర్జరీ అంటూ హంగరీ వెళ్ళరా డింగరీ !
చిత్తం తల్లీ ! వెళ్లి రారా ఊసరవెల్లి !

జై పాతాళ భైరవి !
బాలకా ఓ బాలకా ! ఏమిరా నీ కోరిక !
జన్మనిచ్చిన నాతండ్రి జాడతెలియలేదు తల్లి !

వినక తప్పదురా! బాలకా ఓ విషాద వార్త !
దూరదర్శన్ కు సైతం అందని ఓ దుర్వార్త !
విదేశీ విమానం కూలి 
మంచుకొండల్లో నీ తండ్రి మరణించేడురా!
ఔరా! అక్కటా! ఏమీ దిక్కులేని కుక్కచావు? 
"అంతేరా బాలకా ఉన్నది చాలక"
జాతికిద్రోహంచేయు నేతల జాతకాలే అంతర 
ఉన్నదాంతో తృప్తి చెందేవాడే ఉత్తముడురా!
కసాయి తండ్రికి కర్మచేయుట నీ ఖర్మరా!

తల్లీ మరి నా ప్రస్తుత కర్తవ్యం ?
వినిపించరా ! నా ఈ విశ్వసందేశం !
దిక్కులు పిక్కటిల్లేలా... 
జాతిని పీడించే ఓ జలగలారా !
నీతిలేని ఓ రాతి బొమ్మలారా !
ఇక్కడ బ్యాంకుల్ని దోచుకొని అక్కడ
విదేశీ బ్యాంకుల్లో దాచుకుని దొరల్లా 
విచ్చలవిడిగా విలాసవంతంగా జీవిస్తూ
విదేశాల్లో ఆస్తులున్నాయని విర్రవీగకండి ! 
మంచుకొండల్లో ప్రమాదంపొంచిఉందని మరువకండి !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502

0/Post a Comment/Comments