మహాతపస్వి -స్ఫూర్తిదాయకుడు.

మహాతపస్వి -స్ఫూర్తిదాయకుడు.



మహాతపస్వి -స్ఫూర్తిదాయకుడు.

భారత అన్వస్త్ర కలలను
భారత విజ్ఞాన విస్తృతులను శాస్త్ర విజ్ఞానానికి కృషిచేసిన మహోన్నతుడు..
శాస్త్ర విజ్ఞాన అపరిచితులను పరిచయం చేసి..
క్షిపణుల అభివృద్ధికి ఎంతగానో కృషిచేసిన ఘనుడు..
దేశ విదేశాలలో భారతపతాక రెపరెపలను  
రక్షణ రంగ దార్శి కతలకు దారి చూపించిన
 కర్తవ్య శీలి..
దేశభక్తికి  సునీశితా మేధాసంపత్తికి తార్కాణమై 
భారతరత్నమయ్యేను ..
ఆధ్యాత్మిక తాత్విక చింతనలో కర్తవ్య అంకిత భావంతో కృషిచేసి భారత మాత ముద్దు బిడ్డడై..
కోట్లనుకోట్ల భారతీయులకు ఆరాద్యుడై..
నిరంతర కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ
శాస్త్రవేత్తగా
భారతరాష్ట్రపతిగా సేవలెన్నో చేసి కన్న కలలెన్నో సాకారం చేసుకున్న మహానుభావుడు...
సంగీత సాధన చేసిన మహాతపస్వి..
నిరంతర జీవన యాత్రికుడై..
అవిశ్రాంత దీక్ష దక్షతకు మార్గదర్శకుడై కీర్తిశేషుడై..
భారతమాత చేతి పతాకమై..
దేశ కీర్తిని దశదిశలా చాటిన ఘనుడు.
నివాస యోగ్యమైన భూగ్రహాన్ని సృష్టించండి అనే నినాదానిచ్చిన స్ఫూర్తిదాయకుడు..
ఆయన జీవితం నేటి నవతరానికి స్ఫూర్తి అయినా అమహోన్నతుడే మన  అబ్దుల్ కలాం గారు..

 వి. కృష్ణవేణి
వాడపాలెం.
తూర్పుగోదావరి జిల్లా..

ప్రక్రియ :వచనం.
 

0/Post a Comment/Comments