తెలుగువారి ఆత్మ గౌరవం - వెంకయ్య
హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మల
దాంపత్య తోటలో విరిసిన కుసుమము
చిన్న వయసులోనే సైన్యంలో చేరిన
అసమాన సాహస రూపము..!
ఝాన్సీ లక్ష్మీబాయి వంశీయుడైన
నిలువెత్తు నిష్కళంక దేశభక్తుడు
అవినీతిని అన్యాయాన్ని సహించలేని
ఆరడుగుల ఆజానుబాహుడు..!
వ్యవసాయం పట్ల అభిరుచితో
శాస్త్ర పరిశోధనలు చేశారు
మేలైన తెల్ల బంగారమును
పండించిన వ్యవసాయదారు..!
ఎంతో శ్రమకోర్చి విలువైన
తన అభిమాన విషయమైన
విజయాలకు,శ్రమకు ప్రతీకైన
అద్భుత కేతనాన్ని నిర్మించిన
జాతీయ పతాక రూపకర్త..!
నిరాడంబర జీవనమునకు
ఆయనొక నిలువటద్దము
జాతీయ పతాకం ఎగిరే
వరకు స్మరించుకోదగిన
తెలుగువారి ఆత్మగౌరవము..!
ఖనిజాలు వజ్రాలపై పరిశోధనలు
చేసిన భూగర్భ శాస్త్రజ్ఞుడు
మంచి రచయిత యతడు
స్వతంత్ర సమరయోధుడైన
తెలుగు జాతి ముద్దుబిడ్డడు..!
పిల్లి.హజరత్తయ్య
శింగరాయకొండ
ప్రకాశం జిల్లా
9848606573