విద్వేషాలు వద్దు-సమైక్యమే ముద్దు

విద్వేషాలు వద్దు-సమైక్యమే ముద్దు


విద్వేషాలు వద్దు -సమైక్యమే ముద్దు

మతం అంటే సామాజిక విశ్వాసాలు
మతవిద్వేషాలు అంటే మతమౌఢ్యాలు

ఇవి సమైక్య భారతికి అవరోధాలు
విడగొట్టు ప్రజల ఐక్యతాభావాలు

దేశ సమగ్రతకు,సమైక్యతకు విఘాతాలు
వీటికి ఉండవు పరమతసహనాలు

ఇవి సృష్టించు మతఃకలహాలు
వీటికి మహాత్ముడు అర్పించెను ప్రాణాలు

వీటివలన  నాయకులకు దక్కు రాజ్యాధికారాలు
దేశంలో నశించు శాంతి, అహింసలు

సమైక్య భారత కోసం మతతత్వ సంస్థలను నిషేధించు
సామాజిక సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించు

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించు
పాఠ్యాంశాలలో మతతత్వ భావనలను తొలగించు

వ్యక్తిగత జీవితానికే మతాన్ని అనుమతించు
అధికార హోదాలో జరిగే మతపరమైన తంతులను నివారించు

ప్రజల్లో పెంచు జాతీయతాభావము
దేశంలో బ్రతికించు లౌకికవాదము

జాతిలో సృష్టించు సమైక్యత భావము
నిర్మించు సమైక్య భారతము

మత విద్వేషాలు వద్దు సమైక్య భారతి ముద్దు
మత రాజకీయాలు వద్దు దేశ సార్వభౌమత్వమే ముద్దు


పిల్లి.హజరత్తయ్య,శింగరాయకొండ

0/Post a Comment/Comments