పుత్రులం-మిత్రులం (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

పుత్రులం-మిత్రులం (కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి

పుత్రులం-మిత్రులం

చిట్టి పొట్టి చిరుతలం
గట్టి పట్టు బుడతలం
తెలుగు తల్లి పిల్లలం
వెలుగుతున్న మల్లెలం !

మేం మెరిసే రాత్రి చుక్కలం
మా విరిసే ధాత్రి మొక్కలం
మా భరతఖండ వాసులం
మేం భావిభారత బోసులం !

కుశాగ్రబుద్ది ఉన్నవారలం
దేశాభివృద్ధి కోరు పోరలం
మేం భరతమాత బిడ్డలం
 మాదేశ సరిహద్దు అడ్డలం!

మేం మచ్చలేని ముత్యాలం
మా స్వచ్చమైన రత్నాలం
పచ్చగా మెరిసే పగడాలం
వచ్చగ గరిసే వరివంగడాలం !

మేం విజ్ఞానం కోసం బడికి
మా ధ్యానం కోసం గుడికి
సదా పోతుంటం వస్తుంటం
యధారీతి మేం జీవిస్తుంటం !

మా మాతృభాష తెలుగు
మా ప్రాంతమంతా  వెలుగు
మేం సరస్వతీ పుత్రులం
మా సారస్వత మిత్రులం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెం.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments