పసికూనలు పసిడిపువ్వులు
పల్లవి:
చిట్టి పొట్టి అడుగుల ముద్దబంతులు
మొాముపై నవ్వుతో మెరిసే పువ్వులు
ముంగిట మురిపాల మల్లెలు
మన ఇంటిలో చిగురించే దివ్వెలు
చరణం
వారి కళ్ళలో కాంతుల కలువలు
వారి నవ్వులో సిందూర పువ్వులు
వారి మాటలో ముద్దుల మల్లెలు
మన మమతల పూదోటే పసికూనలు
" మన ఇంటిలో చిగురించిన "
చరణం
బంగారు కలల బంతి పువ్వులు
చదువులమ్మ చెట్టుకు పూరెమ్మలు
పరిమళాల పసిడినవ్వు చిరుజల్లులు
వెలగాలి జువ్వలై తారాజువ్వలై
"మన ఇంటిలో చిగురించిన"
--- శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గంట,
వృత్తి: బిజినెస్ కన్సల్టెంట్,
చరవాణి: 8555069265.